Stories by Journalist Jani on Medium
. నల్ల బంగారానికి అంటిన అవినీతి మరక
. దేశాన్నే కుదిపేసిన స్కామ్.. లక్షల కోట్ల సంపద ఎలా మాయమైంది?
. పాకిస్థాన్ జీడీపీకి సమానమైన నిలువు దోపిడీ!
భారతదేశ ఆర్థిక చరిత్రలో ఎన్నో కుంభకోణాలు మనం చూశాం. స్టాక్ మార్కెట్ గమనాన్నే మార్చేసిన హర్షద్ మెహతా స్కామ్ నుంచి, వేల కోట్ల ప్రజాధనాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీల వరకు అన్నీ సంచలనం సృష్టించినవే. కానీ, వీటన్నింటినీ ఒక ఎత్తున ఉంచితే, భారత ప్రభుత్వ మూలస్థంభాలనే కుదిపేసి, దేశ ఖజానాకు అక్షరాలా లక్షల కోట్ల గండి కొట్టిన ఒక ‘మహా కుంభకోణం’ ఉంది. అదే ‘కోల్‌గేట్’ (Coal-Gate) లేదా బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం. ఇది కేవలం ఒక అవినీతి కథ కాదు. దేశ సహజ వనరులను రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు , బడా పారిశ్రామికవేత్తలు కలిసి ఎలా పక్కదారి పట్టించారో చెప్పే ఒక విషాదకర వాస్తవం. ఈ స్కామ్ విలువ ఎంత అంటే, కొన్ని లెక్కల ప్రకారం ఇది మన పొరుగు దేశం పాకిస్థాన్ మొత్తం జీడీపీకి సమానం!
భారతదేశానికి బొగ్గు ఎందుకు ముఖ్యం?
భారతదేశ ఇంధన రంగంలో బొగ్గు అనేది వెన్నెముక వంటిది. మన దేశ పారిశ్రామిక ప్రగతికి అవసరమైన విద్యుత్తులో మెజారిటీ భాగం బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతుంది. 2014 గణాంకాల ప్రకారం మన ప్రాథమిక వాణిజ్య ఇంధన అవసరాల్లో 55శాతం బొగ్గు నుంచే తీరుతోంది. నేటికీ మన దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో దాదాపు 72శాతం బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే వస్తోంది. ఇంతటి కీలకమైన వనరును నిర్వహించే బాధ్యత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖది.చారిత్రక నేపథ్యం చూస్తే,1973లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ‘కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్’ (బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం) తీసుకొచ్చింది. దీని ఉద్దేశ్యం బొగ్గు తవ్వకంపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉండటం,కార్మికుల సంక్షేమాన్ని కాపాడటం.దీనివల్ల బొగ్గు తవ్వడం,అమ్మడం అనేది కేవలం ప్రభుత్వ సంస్థలైన ‘కోల్ ఇండియా లిమిటెడ్’, ‘సింగరేణి’ వంటి వాటికే పరిమితమైంది. అయితే, ఈ చట్టంలోనే సెక్షన్ 3(3)(a)(iii) అనే ఒక ప్రత్యేక క్లాజు ఉంది. దీని ప్రకారం.. ఇనుము, ఉక్కు, విద్యుత్ , సిమెంట్ తయారీలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బొగ్గు గనులను కేటాయించవచ్చు. కానీ ఒక షరతు ఉంది. వారు ఆ బొగ్గును కేవలం తమ సొంత అవసరాలకే వాడుకోవాలి (Captive Mining), దానిని బయట మార్కెట్లో అమ్ముకోవడానికి వీలులేదు.
డిమాండ్ పెరగడం — తలుపులు తెరవడం
1991లో పి.వి. నరసింహారావు గారి హయాంలో జరిగిన ఆర్థిక సంస్కరణల (Liberalization) తర్వాత దేశంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమైంది. భారీ ఎత్తున ఉక్కు కర్మాగారాలు, సిమెంట్ కంపెనీలు, విద్యుత్ కేంద్రాలు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ విపరీతమైన బొగ్గు అవసరం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా ఈ భారీ డిమాండ్‌ను అందుకోవడంలో విఫలమైంది. పాతబడిన యంత్రాలు, కార్మిక సంఘాల సమస్యల వల్ల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగలేదు.
అప్పట్లో ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి:
విదేశాల నుంచి భారీ ఎత్తున బొగ్గును దిగుమతి చేసుకోవడం. (ఇది విదేశీ మార్పిడి నిల్వలపై భారం పడేలా చేస్తుంది).
ప్రైవేట్ కంపెనీలకు గనుల తవ్వకానికి అనుమతి ఇచ్చి, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం.
ప్రభుత్వం రెండో మార్గాన్ని ఎంచుకుంది. 1993 నుంచి ప్రైవేట్ కంపెనీలకు గనుల కేటాయింపు ప్రక్రియ అధికారికంగా మొదలైంది. అయితే ఇక్కడే పారదర్శకతకు పాతర వేశారు.
కుంభకోణం ఎక్కడ మొదలైంది? స్క్రీనింగ్ కమిటీ మాయాజాలం
సాధారణంగా ప్రభుత్వం భూమిని గానీ, ఖనిజాలను గానీ విక్రయించేటప్పుడు ‘వేలం’ పద్ధతిని పాటిస్తుంది. అంటే ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే ఆ వనరు దక్కుతుంది. కానీ బొగ్గు గనుల విషయంలో ప్రభుత్వం ‘స్క్రీనింగ్ కమిటీ’ అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో ఎటువంటి వేలం పాట ఉండదు.బొగ్గు శాఖ సెక్రటరీ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులతో కూడిన ఒక కమిటీ ఉంటుంది. గనుల కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీల ఫైనాన్షియల్ స్టేటస్, గత అనుభవం వంటి అంశాలను పరిశీలించి ఆ కమిటీ గనులను కేటాయిస్తుంది. ఈ విధానమే అవినీతికి రాజమార్గం వేసింది. ఎటువంటి స్పష్టమైన క్రైటీరియా లేకుండా, కేవలం రాజకీయ సిఫార్సులు ఉన్న వారికి, పాలకులకు అత్యంత సన్నిహితులుగా ఉన్న పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన బొగ్గు గనులను నామమాత్రపు ధరలకే కట్టబెట్టారు. 1993 నుంచి 2010 వరకు దాదాపు 218 బొగ్గు గనులను ఇలాగే పంపిణీ చేసేశారు.
లెక్కలు తేల్చిన ‘కాగ్’ (CAG) నివేదిక
2012లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఒక సంచలన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. వేలం వేయకుండా గనులను అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం వల్ల దేశ ఖజానాకు అక్షరాలా 1.86 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ‘కాగ్’ అధికారికంగా ప్రకటించింది. అయితే, అంతకుముందు మీడియాలోకి లీక్ అయిన ‘కాగ్’ డ్రాఫ్ట్ రిపోర్టులో ఈ నష్టం 10.7 లక్షల కోట్లుగా పేర్కొనడం గమనార్హం!
ఈ సంఖ్యలు ఎంత భయంకరమైనవో అర్థం కావాలంటే ఒక లెక్క చూడాలి. ఆనాడు హర్షద్ మెహతా చేసిన స్కామ్ విలువ 4,000 కోట్లు. కానీ ఈ కోల్‌గేట్ విలువ ద్రవ్యోల్బణాన్ని (Inflation) లెక్కలోకి తీసుకుంటే నేటి విలువ ప్రకారం సుమారు 21.53 లక్షల కోట్ల రూపాయలు ($257.85 బిలియన్ డాలర్లు). అంటే ఇది దాదాపు పాకిస్థాన్ వంటి దేశాల మొత్తం జీడీపీకి సమానం. వేలం పాట నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి వచ్చే ఈ భారీ ఆదాయం, కేవలం కొంతమంది బడా బాబుల జేబుల్లోకి వెళ్ళిపోయింది.
ముఖ్య సూత్రధారులు,పాత్రధారులు
ఈ కుంభకోణం ఒకే పార్టీ లేదా ఒకే ప్రభుత్వం హయాంలో జరిగింది కాదు. ఇది దాదాపు రెండు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగిన దోపిడీ. 1993 నుంచి 2010 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (పి.వి. నరసింహారావు, మన్మోహన్ సింగ్) , బీజేపీ (వాజ్‌పేయి) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాలు రెండూ ఈ కేటాయింపుల్లో భాగస్వాములే.అయితే, 2004 నుంచి 2009 మధ్య కాలంలోనే అత్యధికంగా (సుమారు 90%) కేటాయింపులు జరగడం వల్ల అప్పటి యూపీఏ ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆ సమయంలో బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పరిధిలోనే ఉంది. సిబిఐ దర్యాప్తులో అనేక నగ్న సత్యాలు బయటపడ్డాయి.
* జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, మాజీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి దాసరి నారాయణరావు వంటి వారు లంచాలు తీసుకున్నట్లు, తమకు అనుకూలమైన వారికి గనుల కేటాయింపులు చేసినట్లు తేలింది.
* మాజీ బొగ్గు శాఖ సెక్రటరీ హెచ్.సి. గుప్తాతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో కోర్టులు వారికి జైలు శిక్ష విధించాయి.
* టాటా స్టీల్, టాటా పవర్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఆదిత్య బిర్లా గ్రూప్ (హిందాల్కో), ఎస్సార్ పవర్ వంటి దిగ్గజ కంపెనీలపై కేసులు నమోదయ్యాయి. ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సిబిఐ ఆధారాలు సేకరించింది.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
ఈ వివాదం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. రాజకీయంగా పెను తుఫాను సృష్టించిన ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సెప్టెంబర్ 24, 2014న అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 1993 నుంచి జరిగిన 218 కేటాయింపుల్లో 214 కేటాయింపులను అక్రమమైనవిగా ప్రకటిస్తూ రద్దు చేసింది. స్క్రీనింగ్ కమిటీ విధానం పారదర్శకంగా లేదని, అది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. కేవలం నాలుగు ప్రాజెక్టులను (అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్) మాత్రమే మినహాయించింది. అంతేకాకుండా, అప్పటి వరకు చట్టవిరుద్ధంగా బొగ్గు తవ్విన కంపెనీల నుంచి ప్రతి టన్నుకు రూ. 295 చొప్పున జరిమానా వసూలు చేయాలని ఆదేశించింది.
నేర్చుకున్న పాఠం ,వ్యవస్థలో మార్పు
కోల్‌గేట్ కుంభకోణం భారత దేశానికి ఒక గట్టి పాఠం నేర్పింది. సహజ వనరులు అనేవి ప్రజల ఆస్తి అని, వాటిని పారదర్శకంగా మాత్రమే వినియోగించాలని ఈ ఉదంతం నిరూపించింది.
ఈ స్కామ్ తర్వాత…
=> ప్రభుత్వం ‘బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనల చట్టం’ తీసుకొచ్చింది.
=> 2015 నుంచి గనుల కేటాయింపులో పూర్తిగా ఆన్‌లైన్ వేలం (E-Auction) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోయింది.
=> వేలం పాటల ద్వారా ప్రస్తుతం ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తోంది, ఇది ప్రజల సంక్షేమానికి వినియోగించబడుతోంది.
“భారతదేశం పేద దేశం కాదు, భారతీయులు పేదవారు” అని ఒక ప్రసిద్ధ మాట ఉంది. కానీ ‘కోల్‌గేట్’ వంటి మహా కుంభకోణాలను చూస్తే అర్థమయ్యేది ఏంటంటే.. మన దేశం సంపన్నమైనదే, కానీ ఆ సంపదను కొందరు స్వార్థపరులు వ్యవస్థలను మేనేజ్ చేసి దోచుకున్నారు. సామాన్యుడి కరెంటు బిల్లులోనో, పన్నుల్లోనో పోయిన ఈ లక్షల కోట్ల సొమ్ము పాలకుల అవినీతికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. హర్షద్ మెహతాలు, మాల్యాలు వ్యక్తిగత స్వార్థంతో వ్యవస్థను మోసం చేస్తే, ‘కోల్‌గేట్’లో సాక్షాత్తు వ్యవస్థే వ్యక్తిగత స్వార్థాలకు బలి అయ్యింది. అందుకే ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన, సిగ్గుపడాల్సిన కుంభకోణంగా మిగిలిపోయింది. ఇప్పుడు పారదర్శకమైన వేలం విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ కుంభకోణం వల్ల దేశం కోల్పోయిన సమయం, ఆదాయం మాత్రం ఎప్పటికీ తీర్చలేనిది.
-Jani mastan Shaik