Stories by కథామాలిక on Medium
లావణ్య
చలికాలం. సూర్యుడు బద్ధకంగా బయటకొస్తున్నాడు మేఘాల మాటు నుంచి. సమయం 7:00 కావస్తోంది. రామారావు గారు, జానకమ్మ రోజూ 6:00కే నిద్ర లేస్తారు. రిటైరైనప్పటి నుంచి రామారావుగారికి రోజూ రోడ్డు వరకూ నడిచెళ్ళి దారిలో తెలిసిన వారిని పలకరిస్తూ వార్తా పత్రిక ఆయనే తెచ్చుకోటం సరదా. అలా వెళ్ళి పత్రిక తెచ్చాక కూడా జానకమ్మ నిద్ర లేచి రాలేదు. ఆవిడ చలికి పడుకుందేమో అనుకున్నారు. కానీ ఆదుర్దాగా అనిపించింది.
వెళ్ళి అడిగారు, ఏమైందని. ఆవిడ మెలకువగానే ఉన్నారు కానీ నీరసంగా ఉందన్నారు. ఎడమ చేయీ కాలు స్వల్పంగా లాగుతున్నాయి అన్నారు. సరే రోడ్డు మీదకెళ్ళి టిఫిన్ కొనుక్కొస్తాను కాస్త ఓపిక చేసుకుని పళ్ళు తోముకోమన్నారు. ఆయనకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువసార్లు నడవలేరు. ఓపిక చేసుకుని వెళ్ళి టిఫిన్ తెచ్చారు. ఇద్దరూ టిఫిన్లు చేసాక ఆవిడని గమనించిన ఆయన నరాల డాక్టర్ దగ్గరకు ఆసుపత్రికి వెళ్ళొద్దామన్నారు . ఆవిడకు బి.పి, షుగరు ఉన్నాయి.
నిదానంగా స్నానాదులు ముగించుకుని ఇద్దరూ తయారై ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే చాలా మంది జనం ఉన్నారు. పేరు వ్రాయించుకుని కుర్చీల్లో కుర్చున్నారు తమ వంతు కోసం. పక్క కుర్చీలో ఓ 30-35 వయసున్న ఆవిడ నిద్రపోతూ, తూలిపోతు ఉంది. కాసేపటికి లావణ్య గారూ, లావణ్య గారు పలు సార్లు పిలిచింది నర్సమ్మ. ఎవరూ పలకలేదు. తరువాత వారిని పిలిచింది నర్సమ్మ.
ఎదురు కుర్చీ ఆవిడ ఈ నిద్రపోతున్న ఆవిడ ఒళ్ళో డాక్టర్ ఫైలు మీద పేరు చూసి ఆవిడే లావణ్య అని గుర్తించింది. అయ్యో ఈ అమ్మాయినే పిలిచారండీ ఇందాక అన్నారు ఆవిడ జానకమ్మతో. అయ్యో కూర్చునే విపరీతంగా నిద్ర పోతోంది అనుకున్నారు జానకమ్మ. పేరు పెట్టి పిలిచారు, లావణ్య నుంచి ఏ స్పందనా లేదు. నిద్ర, నిద్ర... పలు మార్లు పిలిచినా అదే పరిస్థితి.
ఎదురుగా ఉన్న ఒకావిడ లేచి వచ్చి తట్టి లేపారు, స్పందన లేదు.. పలు మార్లు లేపాక లావణ్య నిద్ర లేచింది.
చుట్టూ ఉన్న పెద్దవారు ఏంటమ్మా అంతలా నిద్ర పోతున్నావు, నిన్ను ఇందాకే పిలిచారు అన్నారు. అయ్యో అవునా అనుకుంటూ హడావుడిగా నర్సమ్మ దగ్గరకు వెళ్ళింది, ఆవిడ కాసేపాగి మళ్ళీ పిలుస్తాననటంతో వచ్చి కూర్చుంది లావణ్య.
ఏంటమ్మా అంత మత్తుగా నిద్ర పోతున్నావు. బాగా అలసిపోయినట్టున్నావు అన్నారు ఓ పెద్దాయన పలకరింపుగా. దానికి లావణ్య ఔనండీ నిద్రకు అస్సలు సమయం ఉండట్లేదు పనులు, పనులూ.. అందుకే ఇక్కడ కాసేపు కూర్చుంటే అంత నిద్ర పట్టేసింది అంది. అయ్యో అన్నారు చుట్టూ ఉన్నవారు. కాసేపైనా వీలు చేసుకుని రోజూ నిద్ర పోవాలమ్మా అన్నారు ఒకావిడ.
లావణ్య చెప్పటం మొదలుపెట్టింది.
రోజూ పొద్దునే 4:00-4:30 కి లేస్తుంది లావణ్య. ఇంటి పనులు, వంట పనులు, పక్షవాతంతో మంచం మీద ఉన్న అత్తగారి పనులు చేసుకుని 7:30కి తమ ఇంటికి ఆనుకుని రోడ్డు మీద ఉన్న తమ చిన్నపాటి దుకాణాన్ని తెరుస్తుంది. మధ్యలో వీలు చేసుకుని ఇద్దరు చిన్న పిల్లల్ని తయారు చేసి బడికి పంపుతుంది. మధ్యాహ్నం వరకు షాపు, మధ్యలో అత్తగారిని చూసుకోటం, ఖాళీ ఉంటే టైలరింగు పని.
మూడేళ్ళ క్రిందటి వరకూ లావణ్య భర్త భాస్కర్ చూసుకునేవాడు దుకాణాన్ని. వ్యాపారం బాగా నడిచేది. లావణ్య అవసరమైనప్పుడు సాయం చేసేది కాని షాపు వైపు పెద్దగా వచ్చేది కాదు ఆసక్తి లేక. ఇంటి పనులు అత్తా కోడళ్ళు కలిపి చేసుకునేవారు. పిల్లల ఆలనా పాలనా. రోజులు హాయిగా గడిచిపోయేవి ఉన్నంతలో. మూడేళ్ళ నాడు అకస్మాత్తుగా భాస్కర్ ఆక్సిడెంట్లో చనిపోయాడు. అసలేం జరుగుతోందో అర్ధం చేసుకునేలోపు పుట్టెడు దుఃఖంలో ఉన్న లావణ్యకు ఇంటెడు బాధ్యతలు నెత్తి మీద పడ్డాయి. అత్తగారు షాపులో కూర్చోటం మొదలుపెట్టారు. ఆవిడకు అలవాటు, అవగాహనా లేవు. కానీ తప్పదు. కోడలికి తోచిన సాయం చేయాలి పెద్ద దిక్కుగా. లావణ్య ఇంటి పనులు, పిల్లలు, ఖాళీ సమయంలో తనకు వచ్చిన టైలరింగు విద్య మొదలు పెట్టింది. షాపు ఆదాయం తగ్గింది. అంతకు ముందులా లేదు. నిండుకున్న సరుకులు మళ్ళీ తెప్పించటానికి సమయం పట్టేది, ఇలా పలు కారణాలు.
లావణ్యకు టైలరింగు పని తప్పనిసరి అని అర్ధమైంది. మధ్యలో భోజనానికో, ఇతర పనులకో అత్తగారు ఇంట్లోకి వస్తే లావణ్య షాపు చూసుకునేది కాసేపు. రాత్రి 8:00వరకు ఉంచి షాపు కట్టేసేవారు.
లావణ్యకు సాయంత్రం మళ్ళీ ఇంటి పనులు, పిల్లల పనులు. రెండేళ్ళు కుటుంబ బండి నెట్టుకొచ్చారు అత్తాకోడళ్ళు. సంవత్సరం నాడు అత్తగారికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. ఆవిడకు కొడుకు మీద వల్లమాలిన ప్రేమ. కోడలు, పిల్లల గురించి విపరీతమైన దిగులు. ఆ ఒత్తిడి, ఆలోచనలు, అలసట... చివరికి పక్షవాతం. మంచానికి పరిమితం.
లావణ్య పరిస్థితి పూర్తిగా అధ్వాన్నమైంది. షాపు, పిల్లలు, ఇంటి పనులు, అత్తగారి పనులు, టైలరింగు, అంతంత మాత్రం ఆదాయం. తల్లి లేదు, తండ్రి అన్నయ్య కుటుంబంతో పాటు ఉంటారు. మధ్య తరగతి సంసారం అన్నయ్యది. వారి పరిస్థితీ అంతంత మాత్రం. ఐదుగురు బ్రతకాలి. అటు నుంచి ఏ ఆశా లేదు.
కుట్టు మిషన్ని షాపులోకే మార్చుకుంది. పొద్దున్నే 4:00 నుంచి రాత్రి పదకొండు వరకు లావణ్య గడియారంలో ముల్లుతో పాటు పరిగెడుతుంది. అత్తగారు నిస్సహాయంగా కన్నీరు పెడుతుంది. ఆ పడుకునే ఐదు గంటలు కలత నిద్ర, మధ్యలో అత్తగారి అవసరాలు చూసుకోటం, భవిష్యత్తు భయాలూ, ఆలోచనలు.
ఈ మధ్య విపరీతంగా తల నొప్పి వస్తోంది లావణ్యకి. పక్కింటి వారికి రెండు మూడు గంటలు షాపు అప్పగించి, ఎవరో చెప్తే ఈ వైద్యుడి దగ్గరకు వచ్చింది.
లావణ్య చెప్పటం ముగించింది.
ఆసుపత్రిలో చుట్టూ ఉన్న అందరి ముఖాల్లో బాధ. బాగా అలసిపోయి, అందుకే అంత మత్తుగా నిద్రపోయిందని అందరికీ అర్ధమైంది. ఒకావిడ కల్పించుకుని అమ్మా నువ్విలా నీ గురించి పట్టించుకోకపోతే నీకేమైనా అయితే పిల్లలు, మీ అత్తగారు ఏ దారి లేని వారు ఔతారు. నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకు అన్నారు. అన్నారే గానీ ఆవిడకు ఇంకేం చెప్పాలో అర్ధం కాలేదు.
నర్సమ్మ లావణ్యను పిలిచింది. లావణ్య ఆదరా బాదరాగ లేచి వెళ్ళింది. లావణ్య చెప్పిన మాటలు విన్న అందరి చూపులూ లావణ్య వైపే బాధగా....
ఎన్నో, కథలు, వెతలు, నిజాలు, జీవితాలు.
***అమ్మా నాన్న ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నిజంగా విన్న బాధ్యతలతో అలసిపోయిన ఓ మహిళ చెప్పిన విషయాలు ఇవి. పేర్లు కల్పితం.
మేఘ!
సెకనుకోసారి ఎదురుగా ఉన్న దేవుడి పటం వైపు చూస్తున్నాడు విజయ్. మనసంతా అల్ల కల్లోలంగా ఉంది. పక్కన ఏడుస్తున్న శారద, ఓదారుస్తున్న బంధువులు.
"అరెయ్ ఏ.నెగటివ్ రక్తం కావాలి. మన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెట్టాను. ఎక్కువమందికి చెప్పండి. చిన్న పాపకు రక్తం కావాలి సర్జరీకి." ఫోన్లో చెప్పాడు విజయ్. భోజనం చెయ్ విజయ్ అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు విజయ్. తింటాలేమ్మా, మళ్ళీ ఫోన్లో బ్రౌజింగ్ లో మునిగిపోయాడు.
ఎంతసేపూ ఆ ఫోన్లు మాట్లాడటం, లేదా ఆ ఫోన్లో చూస్తూ ఉండటమేనా. ముందు తిండి తిను. లేచి భోజనం చేసాడు. ఈ లోగా ఫోన్ రక్తం దొరికిందని. సంతోషపడ్డాడు విజయ్. ఆలస్యం చేయకుండా రక్తం ఇవ్వదల్చుకున్న స్నేహితుడి స్నేహితుణ్ణి తీసుకుని ఆ పాప ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు రక్తం ఇప్పించటానికి. ఆ పాప తల్లి తండ్రీ చెతులెత్తి దణ్ణం పెట్టారు ఇద్దరికీ. సర్జరీ జరిగి కోలుకుంటుంది ఆ పాప మేఘ. వారానికి ఆ పాప తల్లి తండ్రి విజయ్ కి, స్నేహితునికీ ఫోన్ చేసి ఇంకోసారి ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్తారు. విజయ్ ని పాపను చూడటానికి రమ్మని అడుగుతారు.
విజయ్ పాపను చూడటానికి వెళ్తాడు. తమకు లేక లేక కలిగిన సంతానం అని, మేఘ కు సర్జరీ అవసరమై రక్తం అవసరమైనప్పుడు దేవుడిలా సాయ పడ్డాడని విజయ్ కి కృతజ్ఞతలు చెప్తారు. ఇంకో రెండ్రోజుల్లో డిస్చార్జ్ చేస్తారని, పాప బాగానే కోలుకుంటున్నట్లు డాక్టర్ గారు చెప్పారని విజయ్ కి చెప్తారు. పాపను పలకరిస్తాడు విజయ్. పాప విజయ్ ని అన్నా అన్నా అంటూ మాటలు చెప్తుంది. విజయ్ ఆ పాపను చూసి చాలా సంతోషిస్తాడు. తాను నిలబెట్టిన బుజ్జి ప్రాణం మరి.
"విజయ్ నేను మేఘా నాన్నను, మూడు నెలల క్రిందట మేఘ కు రక్తం ఏర్పాటు చేసావు గుర్తుందా సున్రైజ్ హాస్పిటల్ లో.."... " ఆ చెప్పండి సార్, గుర్తుంది. ఇప్పుడెలా ఉంది మేఘా" అడుగుతాడు విజయ్. " దేవుడి దయవల్ల, నీ సాయం వల్ల పూర్తిగా కోలుకుంది విజయ్. స్కూల్ కి వెళ్తోంది కూడా. వచ్చే వారం మేఘ పుట్టిన రోజు, 7 నిండి 8 వస్తాయి. నువ్వు తప్పకుండా రావాలి, నీ స్నేహితుడికి కూడా ఫోన్ చేసాం". అని మరీ మరీ చెప్పి అడ్రెస్ చెప్పి ఫోన్ పెట్టేసాడు మేఘ వాళ్ళ నాన్న.
చెప్పిన రోజు విజయ్ మేఘ పుట్టిన రోజు పార్టీకి వెళ్ళాడు. వాళ్ళు చాలా బాగా చూసుకుని, విజయ్ ని, స్నేహితుణ్ణి చుట్టాలకు పరిచయం చేసారు. పార్టీని ఆనందంగా జరుపుతారు. విజయ్ తాను రక్తం ఏర్పాటు చేదొన చాలా మంది దగ్గర ఇటువంటి అభిమానాన్ని, కృతజ్ఞతా భావాన్ని చూసి ఉన్నాడు. ఆ ఆనందం తనకు కొత్త కాదు. కానీ చాలా సంతోషించాడు మేఘ ను చూసి.
"ఎరా ఫోన్ మాట్లాడటం అయ్యిందా, ఈ గ్రైండర్ బరువుగా ఉంది పక్కకు జరిపి పెట్టు, ఎప్పుడూ ఆ ఫోలే!" విసుక్కుంది విజయ్ తల్లి. ఏం లేదులే ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా అంటూ ఫోన్ మాట్లాడుతూనే పని పూర్తి చేసాడు విజయ్. "సర్లే నేను బయటకు వెళ్ళోస్తా, శ్రీనుగాడి ఇంటి వరకు" అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ బైక్ తీసాడు. "ఒరేయ్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపకు రా. మాట్లాడేసి వెళ్ళు" అరిచింది తల్లి.. ఆ సర్లే అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు విజయ్.
ట్రాఫిక్ బాగానే ఉంది. ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా వస్తున్నవి చూసుకుంటూ బండి నడుపుతున్నాడు విజయ్. రెప్ప పాటులో బండి హ్యాండిల్ పక్కకు తిప్పి జారి రోడ్ పక్కనున్న మట్టి మీద పడ్డాడు. వెంటనే తేరుకుని పైకి లేచాడు. మోచెతికి కాలికి చిన్న దేబ్బలు. ఎదురు బండి మీద వస్తున్న జంట, చేతిలో పాప. ఆవిడ మట్టి మీద పడి తేరుకుని లేచింది. ఆయనకు రోడ్డు దెబ్బలు బలంగా తగిలాయి, కష్టం మీద లేచాడు. పాప కూ రోడ్డు దెబ్బ గట్టిగా తగిలింది స్పృహ లేకుండా పడుంది రోడ్డు మీద. హఠాత్తుగా అడ్డొచ్చిన విజయ్ బండిని తప్పుంచబోయి బండి జారి ఈడ్చుకుంటూ వెళ్ళి పడిపోయింది.
విజయ్ పరుగున పాప దగ్గరకు వెళ్ళాడు. చేతిలోకి తీసుకుని చూస్తే.... మే... ఘ!!
మెదడు మొద్దుబారిపోయింది. కనిపించిన వాహనాలన్ని ఆపటం మొదలెట్టాడు. ఒక ఆటో అతని సాయం తో మేఘ నానను ఎక్కించి, మేఘ అమ్మ, తను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మేఘ తల్లికి ప్రధమ చికిత్స చేసి, తండ్రిని మెఘను అడ్మిట్ చేసుకున్నారు.
పరీక్షలు చేసి ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయ్యిందని భయమేమీ లేదనీ, పాపకు మాత్రం తల వెంక పెద్దగయమైందని పరిస్థితి విషమనని డాక్టర్లు చెప్తారు! విజయ్ కి అంతా అయోమయంగా, భరించలేనంత బాధగా ఉంటుంది
మేఘ బంధువులు వస్తారు. మేఘ తల్లి ని సముదాయించటం బంధువులకి కష్టమౌతుంది. డాక్టర్లు శత విధాలా ప్రయత్నాలు చేస్తారు. సాయంత్రానికి మేఘ ఇక లేదని తీసుకెళ్ళమని చెప్తారు. మేఘ తల్లి కుప్ప కూలి స్పృహ తప్పి పడిపోతుంది.
విజయ్ శూన్యం లోకి చూస్తూ ఉండిపోతాడు!
**బంధం**
కాలేజ్ క్యాంటీన్లోకి వచ్చి ఒక పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది వింధ్య. చుట్టూ చూసింది కిరణ్ కోసం, కనిపించలేదు. గ్లాసులో మంచినీళ్ళు పోసుకుని తాగి మళ్ళీ చుట్టూ పరికించి చూసింది. అప్పుడు కనిపించాడు కిరణ్ చేతిలో కాఫీకప్పులతో. వింధ్యను చూసి ఓ చిరునవ్వు ఇటేసి తన పనిలో నిమగ్నమైపోయాడు. తనేవస్తాడులే పనయ్యాక అనుకుంది.
వింధ్య కి మొహమాటం ఎక్కువ, మితభాషి. స్కూల్ లో ఇంటర్లో గొప్ప స్నేహాలేమీ లేవు. అమ్మా, నాన్నా, తమ్ముడూ ఇదే తన ప్రపంచం. ఎంతమంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు అనుకునేది.
నాలుగేళ్ళక్రిందటిమాట. చాలా యాదృచ్ఛికంగా జరిగింది పరిచయం. బి.టెక్ మొదటి సంవత్సరం ల్యాబ్ లో! చేరి ఆరు నెలలు అయినా క్లాస్ లో అందరి పేర్లూ తెలుసు, పలకరింపులూ ఉన్నాయి, పెద్ద స్నేహం మాత్రం లేదు. తనపక్కనే కూర్చునే వారితోనే కాస్త ఎక్కువ మాట్లాడేది.
ఓరోజు లేట్ అయిపోతోంది అనుకుంటూ ఉరుకులపరుగుల మీద ల్యాబ్ కి వచ్చింది. ప్రతీ ల్యాబ్కి ఎంతోకొంత ముందే చూసుకుని చదువుకుని వచ్చే తను ఈసారి ముందు వారమంతా పెళ్ళిళ్ళకు పేరంటాలకు తిరిగి ఏమీ చదవకుండా వచ్చింది. ఆ ల్యాబ్ లెక్చరర్ అంటే అందరికీ హడల్. ఆలోచిస్తేనే భయం వేస్తోంది. తనకు ఈరోజు తిట్లు ఖాయం అనుకుంది. పక్కన డెస్క్ దగ్గర కిరణ్ కనిపించాడు. భయంతో వచ్చిన ధైర్యంతో కిరణ్ ని పిలిచింది. నన్నేనా అన్నట్లు చూసాడు. "కొంచెం ఈరోజు ల్యాబ్ టాపిక్స్ గురించి క్విక్ డీటెయిల్స్ చెప్తారా అని అడిగింది" సార్ ఇంకా మొదటి టేబుల్ దగ్గరే ఎవరికో అక్షింతలు(తిట్లు) వేస్తున్నారు. వింధ్య దగ్గరకు వచ్చి 5 నిముషాల్లో చెప్పేసి వెళ్ళిపోయాడు కిరణ్. త్వరగా అయినా ఎంత వివరంగా చెప్పాడు అనుకుంది. ఆ రోజు గట్టెక్కేసింది వింధ్య.
తరువాత వారం కిరణ్ పలకరించాడు ల్యాబ్ లో, ఏంటి క్రిందటి వారం దెబ్బకి మొత్తం చదివేసినట్లున్నారు అసలు కంగారు భయం లేవు ఈ రోజు అన్నాడు నవ్వుతూ. ఆ సార్ అంటే ఉన్న భయం అలాంటిది అని నవ్వేసింది తను. అప్పటినుంచి పలకరింపులు పెరిగాయి. కిరణ్ చాలా చురుకు, మాటకారి, కలుపుగోలుమనిషి.
పలకరింపులు పెరిగాయి. తరచూ మాట్లాడేవారు. మొదటి సంవత్సరం అయిపోయింది.
రెండో సంవత్సరం మొదలైన కొన్ని వారాలకి వింధ్య క్లాసులు అయ్యాక క్యాంటిన్ కు వచ్చింది. టేబుల్ చూసుకుని కూర్చుంది. ఆర్డర్ చేద్దామని చూస్తే కిరణ్ సర్వ్ చేస్తూ కనిపించాడు. ఆశ్చర్యపడింది. ఒక లెక్చరర్ గారికి సర్వ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన తాను చేతనైనంత సాయం చేస్తాను అని చెప్తున్నారు. కిరణ్ ముఖం పై అదే నవ్వు
"మీరు శ్రద్ధ తీసుకుని అడిగినందుకు చాలా కృతజ్ఞతలు సార్. నాన్నగారు చిరుద్యోగి. నలుగురం బ్రతకాలి. ఎటువంటి రిజర్వేషన్లు లేవు. ఒక సెంటున్నర భూమిలో ఇల్లుంది, కాబట్టి ఆర్ధిక పథకాలూ రావు. దూరం వచ్చి మంచి కాలేజ్ అని ఇక్కడ చదువుతున్నాను. ఫీ ఆయన కట్టినా, మిగిలిన ఖర్చులన్నీ నేను సంపాదించుకుని భారం తగ్గించాలని నా ఆశ. ఇల్లు అమ్ముతానంటే వద్దన్నాను. అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు, వైద్యానికి అవసరమైతే ఆ ఇల్లు అప్పుడు అమ్మొచ్చని నా ఆలోచన.
క్యాంటీన్ బాబయ్ ని మొదటి సంవత్సరం లోనే పని అడిగాను, బయట ఇంకెక్కడైనా అయితే రానూ పోనూ సమయం వృధా అని. ఆయన మొదట సంశయించినా ఇప్పుడు ఇచ్చారు. రోజూ సాయంత్రం, వారాంతాల్లో పార్టీలున్నప్పుడు, క్యాటరింగ్ వర్క్ చేస్తే బాగానే ఇస్తున్నారు. నేనేమీ త్యాగాలు ఘనకార్యాలూ చేయట్లేదు. నా కుటుంబానికి తోడుగా ఉండటం నా బాధ్యత. అంతే మనకు కొత్త కానీ, విదేశాల్లో ఇలా పని చేసుకుంటూ చదువుకోవటం సర్వ సాధారణం” అన్నాడు కిరణ్
ఆయన మెచ్చుకోలుగా చూసి భుజం తట్టి వెళ్ళిపోయారు. తరువాత కిరణ్ వింధ్య దగ్గరకు వచ్చాడు. ఆశ్చర్యపడింది చాలుగాని ఏం తింటావో చెప్పు అన్నాడు. వింధ్య "నువ్వు గొప్పోడివి సార్" అంది ఆటపట్టిస్తూ. కావలసినవి చెప్పింది. తరువాత తినేసి వెళ్ళిపోయింది.
వీలైనప్పుడు కిరణ్ కోసం కూడా ఇంటి భోజనం తెచ్చేది. "నా వంటా, ఆ క్యాంటీన్ భోజనం చేసి విసుగొచ్చింది. నువ్వు తెచ్చే భోజనం మాత్రం సూపర్ అనేవాడు." ఒకరంటే ఒకరికి గౌరవం అభిమానం మరింత పెరిగాయి. చదువుని ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా బాగా చదివేవారు ఇద్దరూ. వింధ్య ఇంట్లో కిరణ్ ని పరిచయం చేసింది. తరచూ వెళ్ళేవాడు.
కాలం గిర్రున తిరిగి నాలుగో సంవత్సరానికి వచ్చారు. ఈ ప్రయాణం లో అలకలు, విసుగులు, కోపాలు, సాయాలు అన్ని జరిగాయి. ఫేర్వెల్ రోజు రానే వచ్చింది. దీప్తి వచ్చి పక్క కూర్చుని అడిగింది వింధ్యను ఎగ్జాంస్ అయ్యక ఎవరిదారిన వాళ్ళం వెళ్ళాలి, మరి మీ ఇళ్ళలో చెప్పారా, లేకపోతే ఇక్కడితో వదిలేస్తున్నారా అని. వింధ్య ఏమిటన్నట్లు చూసింది. దీప్తి మీ ప్రేమ గురించి అంది
వింధ్య పెద్దగా ఆశ్చర్య పడలేదుగాని గట్టిగా నవ్వేసింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు తన గురించి కిరణ్ గురించి ఇలా అనుకోవటం తను వినటం. "నీ బొంద, మేము స్నేహితులం. మా మధ్య చాలా గొప్ప అపురూపమైన బంధం ఉంది అదే స్నేహం. కిరణ్ అమ్మాయి అయినా, నేను అబ్బాయినని అయినా నీకు ఈ సందేహం వచ్చేది కాదు. నీకే కాదు చాలా మందికి ఇదే ఆలోచన మమ్మల్ని చూస్తే. నా కుటుంబం ఎలానో కిరణ్ కూడా అంతే. మేము ఎక్కడ ఉన్నా ఎంత దూరాన ఉన్నా కిరణ్ నా స్నేహితుడు జీవితాంతం" అంది. పార్టీ సరదాగా గడిచిపోయింది.
కిరణ్ని చూస్తూ, ఎంతమంచి స్నేహం దొరికింది తనకు అనుకుంది. తల్లితండ్రుల్ని, తోబుట్టువుల్ని దేవుడిస్తాడు. స్నేహితుల్ని మనమే ఏర్పరచుకుంటాం. ఇద్దరు ఆడవాళ్ళదీ స్నేహం, ఇద్దరు మగవాళ్ళదీ స్నేహం అవ్వొచ్చు. మరి ఆడ మగ మధ్య? గొప్ప స్నేహం కూడా ఉండొచ్చు! స్నేహానికి లింగబేధం ఏమిటి? నా తమ్ముడిలాంటివాడు, అన్నలాంటివాడు అని ఎందుకు పరిచయం చెయ్యాలి? ఇంకో అపురూపమైన గొప్ప బంధం ఉంది. అదే స్నేహం!
కిరణ్ తనముందు తను తినేవి, ఒక కప్పు కాఫీతో ప్రత్యక్షం అవ్వటంతో ఈ లోకంలోకి వచ్చింది వింధ్య. " మొత్తానికి ఫైనల్ ఇయర్ వరకు పని చేశావు మీ బాబాయి క్యాంటీన్లో, బయట ప్రోగ్రామింగ్ ట్యూటర్ గా చేస్తూకూడా" అంది. "నాకు అవసరం ఉన్నప్పుడు బాబయి పని ఇచ్చాడు. ఆయనకు మన ఏజ్ వాళ్ళ పార్టీల్లో నేను హెల్ప్ అవుతున్నాను అనిపించి చదువయ్యేవరకూ ఉండమన్నారు. ఉండిపోయాను. మన అవసరం తీరగానే వదిలేయకూడదు కదా. ఇప్పుడు మన జూనియర్ ఒకతను నేను మానేశాక పని ఇవ్వమని అడిగాడట. ఆయన హ్యాపీ"
క్యాంపస్ ఇంటర్వ్యూలో, చెరో కంపెనీలో వేరువేరు ఊళ్ళలో ఉద్యోగం సంపాదించారు ఇద్దరు. విడిపోతామన్న బెంగ లేదు కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వెళ్తే ఏ బాధ ఉంటుందో ఆ బాధే కలిగింది ఇద్దరికీ ఆఖరి రోజున. వీడ్కోలు చెప్పుకుని భవిష్యత్తు కోసం ముందుకు అడుగులువేశారు ఈ "స్నేహితులు” 💐💐
సర్వేజనా సుఖినోభవంతు!
పరుగు!!
పుట్టినప్పుడు మొదలెట్టామేమో పరుగు! అలసట వచ్చినా ఆగని పరుగు ఇది, అనంతం లో కలిసేవరకు. నడవటం కుదరదా? వెనకబడతామని భయం. అసలు వెనకబడతాము అనే భావన వస్తోందంటే ఎవరితో ఈ పోటీ? సాటి మనిషితోనా? ఔనేమో! కాదేమో! ఎందుకు ఈ పోటి అసలు సాటి మనిషితో? కాలంతో నా పోటీ?
కాలంతోనా? గెలవగలమా అసలు?
ఈ పరుగులో ఆరాటాలూ, పోరాటాలు ఎన్నో. డబ్బు, హోదా, పరువు, పదవులు, అధికారం ఎన్నో ఈ పరుగులో. ఈ పరుగులో మనల్ని మనం మర్చిపోతున్నామా? మనమే మారిపోయి మనల్ని మనం కోల్పోతున్నామా?
ఈ పరుగులో కోపాలు, అహంకారాలు, అసూయలు, ద్వేషాలు ఎన్నో? అసలు ఎందుకు ద్వేషిస్తున్నాం? ఎవరిని ద్వేషిస్తున్నం? మనిషిని! మరి ఓ భూకంపం వస్తే ఎవరిని ద్వేషించాలి? దేనికి అసలు అహంకారం? డబ్బుందనా? చదువుందనా? పదవి ఉందనా? దానికి అహకారం ఎందుకు? నీకంటే మేధావిని, ప్రతిభాశాలిని నువ్వు ఇంకా కలవలేదేమో అయితే. కలిసినా నువ్వే మేధావివి ప్రతిభాశాలివి అనుకుని “నేను” అని భ్రమలో మూర్ఖంగా బ్రతికేస్తున్నామో!అది మేధస్సు ఎలా ఔతుంది అప్పుడు?
సాధించాలి! ఏం సాధించాలి? డబ్బా? తృప్తా? సంతోషమా? ప్రేమా? గొప్ప స్థాయా?
సాధించాలా, జీవించాలా?
ముందు తిండి, బట్ట, నీడ కావాలి. అవి వచ్చాక వసతులు కావాలి! తరువాత సౌకర్యాలు కావాలి. తరువాత స్థాయీ హోదా అధికారం కావాలి, మరింత డబ్బు కావాలి. వేలు, లక్షలు, కోట్లు, పదుల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు…
అసలు ఎంత కావాలి?
నువ్వు, నీ కుటుంబం బ్రతకటానికి. నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు బ్రతకాటానికి. మరి వందల వేల కోట్లెందుకు? మూడు తరాల తరువాత అసలు నిన్నెవరు గుర్తుపెట్టుకుంటారు? మరి ఎందుకు ఈ విపరీతమైన ఆరాటం? విషపు పోరాటం?
ఏ వృత్తి గొప్పది?
నాకైతే తెలియదండీ! ఎన్నో ప్రాణాల మీదికి తెచ్చే వృత్తులు, పక్కవారి ప్రణాలకు బాధ్యత వహించాల్సిన వృత్తులు, ఇలా ఎన్నో. “సహజంగానే ఎక్కువ చదివిన వృత్తుల్ని పొగిడేస్తాం!”
ఒక డ్రైనెజ్ కార్మికుణ్ణి చూసినప్పుడు అనిపిస్తుంది, సాటి మనిషి అతను. రోజూ ఆ మురికి కూపంలోకి, కంపులోకి దిగి, రోగాలు కొని తెచ్చుకుని వృత్తిధర్మం నిర్వర్తిస్తాడు. 🙏 మన సెప్టిక్ ట్యాంక్ నిండాగానే ఫోన్ చేస్తాము. అదెంత కష్టమైన పని!
. ఎన్నో రసాయనాలతో, ఎన్నో హానికారక ప్రయోగాలతో నిత్యం సహజీవనం చేసే శాస్త్రవేత్తలు ఎందరో. ఇన్ని మెడికల్ సామాగ్రి, ఇన్ని మందులు, ఇన్ని ఎలెక్ట్రానిక్ పరికరాలూ.. వీటి వెనుక ప్రాణాంతక ప్రయోగాలెన్నో!! జీతాలు తక్కువ కుటుంబం తో గడిపే సమయమూ తక్కువ. ప్రయోగాల్ని బట్టి ఒత్తిడి రసాయనాలు, కిరణాలు…. ఆరోగ్యం సర్వనాశనమయ్యే అవకాశాలు ఎక్కువే🙏
. ఒక పైలెట్. విమానం నడిపేది గాల్లో. పక్కకి ఆపటానికి రోడ్ కాదు అది. చేతిలో కొన్ని వందల ప్రాణాలు నిత్యం. చూపు సరిగ్గా ఉండాలి. నిద్ర వచ్చినా రాకున్నా నిద్రపోయి తీరాలి, తరువాత రోజు ఉద్యోగానికి వెళ్ళాలంటే. ఏమాత్రం ఏమరపాటు కూడదు. వాతావరణ ప్రభావాలు. ప్రతీ టేక్ ఆఫ్, ప్రతీ ల్యాండింగ్ ఒక సవాలే. ఎన్ని చింతలున్నా పని మీద శ్రద్ధ ఉండాల్సిందే🙏
. సైనికుడు! తిరిగి ఇంటికి వస్తామో రామో కూడా తెలియని వృత్తి. ప్రాణం పోతుందని తెలిసినా ముందుకే వెళ్ళాల్సిన వృత్తి. వాతావరణం ఎలా ఉన్నా, తిండి ఉన్నా, లేకున్నా ముందుకు వెళ్ళాల్సిందే. దేశాల పోరుకు, ఆధిపత్య దాహానికి బలౌతున్న సమిధలు🙏
. రైతు! విత్తనాలు, ఎరువులు, నీళ్ళు, తెగుళ్ళు, కూలీల అందుబాటు అడుగడుగునా సమస్యలే. ఇవన్నీ దాటి వచ్చినా, పంట పుష్కలంగా పండినా, వారంలో కోత ఉందనగా తుఫాను రాదన్న హామీ లేదు. పంట ఏ క్షణాన మునిగిపోతుందో తెలియదు, ఏ చలి పూత రాల్చేస్తుందో తెలియదు, వాతావరణాన్ని ఆయన నియత్రించలేడు. పోనీ ఇదీ దాటినా, పంటకు ధర సంగతి ఎప్పుడు ప్రశ్నే.. ఈ రైతన్న పొలంలో అడుగుపెట్టని నాడు నువ్వు ఇంజినీరువైనా, డాక్టరువైన, కుభేరుడివైనా, దేశానికి రాజువైనా… తినేది మట్టే! 🙏
. ఇండియాలాంటి దేశాల్లో విపరీతమైన కాలుష్యం మధ్య రోజూ నిలబడే ట్రాఫిక్ సిబ్బంది. ఎండా, వానా ఏదయినా వారి వృత్తి వారిదే.. 🙏
. వైద్యులు/నర్సులు అన్ని రకాల వైద్య సిబ్బంది. ఇంకొకరి ప్రాణాల్ని నిలబెట్టగలిగే బాధ్యతాయుతమైన ఒత్తిడితో కూడుకున్న వృత్తి. కరోనా లాంటి అరుదైన మహమ్మారులొచ్చినప్పుడు తమ ప్రాణాల్ని సైతం ఇబ్బందుల్లోకి నెట్టే వృత్తి🙏
సాఫ్ట్వేర్/హార్డ్వేర్ తదితర ఎంజినీర్లు! ఒక వైద్య రంగ అప్లికేషన్లు సరిగ్గా పని చేస్తున్నాయన్నా(ఒక్క పేరు మారినా, జబ్బు సమాచారం మారినా, అన్ని తలకిందులే మరి), మీ డబ్బు బ్యాంక్ లో భద్రంగా ఉందన్నా(దాచిన డబ్బు పోతే మందు కూడా కొనలేరు మరి), మీ రైళ్ళు, బస్సులు, కార్లు నడుస్తున్నాయన్నా… ఎన్నో వత్తిళ్ళ మధ్య చేసే వృత్తులున్నాయి. ఒక హ్యాకింగ్ జరిగితే వీళ్ళ మీద ఉండే ఒత్తిడి… 🙏
పోలీసులు/ ఇంటెలిజెన్స్.. వీటిల్లో స్థాయిని బట్టి పెరిగే ఒత్తిడి, ప్రాణాల మీదికి తెచ్చే పనులు అనేకం. సమాజ శాంతి వీరి చేతుల్లో! ఎన్ని దాడుల్ని మనకు తెలియకుండానే ఆపి మన ప్రాణాల్ని ఎన్నిసార్లు రక్షించి ఉంటారో. తమ ప్రాణాల్ని కోల్పతూంటారు ఎక్కడో ఒక చోట నిత్యం🙏
అగ్నిమాపక సిబ్బంది. ప్రాణాల్ని పణంగా పెట్టే మరో వృత్తి. మంటల్లో, వరదల్లో, ఎత్తుల్లో వీరి సేవలు అసామాన్యం🙏
. నిత్యం వేల కిలోమీటర్లకు సరుకుల్ని, మందుల్నీ చేరవేసే డ్రైవర్లు, సముద్రాల్లో సరుకు మందుల్నీ చేరవేసే నావికా సిబ్బంది, వర్షం లో, రాత్రుళ్ళలో కరెంట్ సరి చేసే ఎలెక్ట్రీషియన్లు, మీ డబ్బుకు బంగారానికి భద్రత నిచ్చే బ్యాంకులు… .. అసలు ఏ వృత్తి కష్టమైనది కాదు?! ఏ వృత్తి గొప్పది కాదు?! ప్రతి చెయ్యీ తోడయితేనే మనం ఉన్నాం. 🙏
సర్వేజనా సుఖినోభవంతు !💐🙏
ఈ క్షణం!
కరిగిపోతున్న ఈ క్షణం మరల రాదు
ఆనందంలో ఈ క్షణం శాశ్వతం కావాలనిపిస్తుంది
బాధలో ఈ క్షణం త్వరగా కరిగిపోవాలనిపిస్తుంది
పరిష్కారం వెతుకుతున్నప్పుడు ఇంకొన్ని క్షణాలుంటే బాగుణ్ణు అనిపిస్తుంది
జ్ఞాపకాల్లో విహరిస్తున్నప్పుడు ఆ క్షణాలు మళ్ళీ వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది
అదే క్షణం…. భావాలే అనేకం!!
మాస్క్ ఏగా పెట్టుకోమంది – నిర్లక్ష్యం ఖరీదు!
“తాతా కథ చెప్పు తాతా! కొత్త కథ చెప్పాలి ఈ రోజు సరేనా” అడిగాడు ఏడేళ్ళ అవినాష్.
మనవడి వంక మురిపెంగా చూస్తూ “సరేలేరా చెబుతాను. నీకు రోజూ కొత్త కథ కావాలి” అన్నారు వెంకటరామయ్య నిద్రపోతున్న నాలుగేళ్ళ గీతను జోకొడుతూ.
“ఏమయ్యో! మజ్జిగ తాగు, ఇక్కడ గట్టుమీద పెడుతున్నాను” గ్లాసు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది గంగమ్మ. “సరేలే” అన్నారు వెంకటరామయ్య.
కథ చెప్పడం మొదలుపెట్టారు రామయ్య. కథ వింటూ నిద్ర పోయాడు అవినాష్. లేచివెళ్ళి గ్లాస్ మీద మూత తీసి మజ్జిగ తాగి గ్లాసు గట్టు మీద పెట్టారు. “పిల్లలు నిద్రపోయారా” అడిగింది గంగమ్మ. “ఆ! పడుకున్నారు. వాళ్ళకి మనమిచ్చే ఖర్చులేని సంతోషాలు ఇయ్యేగా. ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేస్తామో. ఆలోచనలొస్తే కునుకట్టడంలేదు. నీ రెక్కల కష్టం మీద నలుగురం బతుకుతున్నాము. నాకా చూపు సరిలేదాయే.” దిగులుపడ్డాడు రామయ్య.
“ఊరుకోవయ్యా! నువ్వు వ్యవసాయం చేసినంతకాలం నీ రెక్కల మీద నేను బతకలేదా కడుపులో చల్ల కదలకుండా! ఒకరికొకరం తోడు. మనం ధైర్యంగా ఉండాలి పిల్లలకు ధైర్యమివ్వాలి. నాకు చాలా ఓపిక ఉంది. దిగులేమి లేదు. హాయిగా నిద్రపో”
“అమ్మాయి అల్లుడూ ఉంటే మనకీ పరిస్థితి వచ్చేది కాదు. అల్లుడైనా కొడుకులా చూసుకునేవాడు. తనకిలేని తల్లితండ్రులను మనలో చూసుకునేవాడు. ఆళ్ళతోపాటే ఉన్న రెండు ఎకరాల పొలం అమ్మేసుకుని ఈ పట్నం వచ్చాము, నాకు చూపు తగ్గిన తరువాత. ఆ రోడ్డు ప్రమాదం ఇద్దరినీ ఒకేసారి పొట్టనెట్టుకుంది. అప్పుడే మూడేళ్ళైంది ” కళ్ళవెంట నీళ్ళొచ్చాయి రామయ్యకు. “అవునయ్యా. మన చేతిలో ఏముంది చెప్పు?” కళ్ళవెంట నీళ్ళొచ్చాయి గంగమ్మకు. “ఈ పసోళ్ళని ఎట్టాగైనా ఉన్నంతలో చక్కగా పెంచాలయ్య”
“సర్లే, ఇంక నువ్వు పడుకో. పొద్దున్నే పనిలోకెళ్ళాలి” అన్నారు రామయ్య. ఆలోచనలకు ఎప్పటికో నిద్ర పట్టింది ఇద్దరికీ.
పొద్దున్నే ఐదింటికే లేచి పిల్లలకు ఇడ్లీలు వేసి, పాలు కాచి, రామయ్యకు చెప్పి పనికి వెళ్ళిపోయింది గంగమ్మ. గంగమ్మ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్లలో నాలుగిళ్ళలో పనులు చేస్తుంది రోజూ. ఆవిడకూ వయసు వల్ల, ఒత్తిళ్ళ వల్లా వచ్చిన షుగరు, బి.పి ఉన్నాయి. కాని ఓపిక చేసుకుంటుంది. నిబ్బరంగల మనిషి.
సునంద ఇంటి బెల్ నొక్కింది గంగమ్మ. “రా గంగమ్మా”, అంటూ తలుపు తెరిచారు గంగాధరం. లోనికి వచ్చి పనులు మొదలు పెట్టింది గంగమ్మ. “మాయదారి రోగం వచ్చింది గంగమ్మా, నువ్వూ, రామయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాకోసం మాస్కులు, చేతులు కడుక్కునేవి కొనుక్కున్నాము. నీకోసం కూడా కొన్నాము. వెళ్లేటప్పుడు ఇస్తాను” అంది సునంద.
వారికి ఒక్కడే కొడుకు చదువుకోసం వేరే ఊర్లో హాస్టల్లో ఉంటున్నాడు. ఆర్ధికంగా స్థిరత్వం ఉన్న కుటుంబమే, ధనవంతులు కాకపోయినా. ఇల్లూడ్చి, అంట్లు తోమేసి, ఇల్లు తుడిచి వచ్చింది గంగమ్మ.
“ఆ రేడియోలో చెప్తూంటే ఇన్నానమ్మ. కరోనా అంటున్నారు”అంది గంగమ్మ. “సరే, ఇవిగో మాస్కులు, నువ్వు రామయ్య ఇద్దరు బయటికొచ్చేటప్పుడు కచ్చితంగా పెట్టుకునే రండి. ఈ పెద్ద డబ్బా శానిటైజర్ అంటారు, చేతులు శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు అఖ్ఖర్లేదు. చెతిలో పిండుకుని తుడుచుకోవాలి. బయట లిఫ్టులు, అవి ముట్టుకున్నప్పుడు పనయ్యాక ముఖం మీద చేతులు వేయకుండా వెంటనే దీనితో చేతులు శుభ్రం చేసుకొ, పూర్తిగా వేళ్ళతో సహా”. ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పి ఇచ్చింది సునంద.
“ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఆ పసివాళ్ళకు మీరే ఆధారం. మాకొసం మాస్కులు తెచ్చిన ప్రతీసారి మీకూ తెస్తాము. పనికెళ్ళే ప్రతీ ఇంటికీ మాస్కు పెట్టుకునే వెళ్ళు. జాగ్రత్త ఇద్దరూ.” అని చెప్పింది సునంద.
అన్ని విషయాలూ శ్రద్ధగా విని గుర్తుపెట్టుకుని, మిగిలిన ఇళ్ళలో పనులు ముగించుకుని ఇంటికి చేరింది గంగమ్మ. సునంద చెప్పిన జాగ్రాత్తలన్ని రామయ్యకూ చెప్పింది. “నేను బయటకు వెళ్ళనులే ఎట్టాగూ. నువ్వు జాగ్రత్త గంగమ్మా”. అన్నారు రామయ్య. “అలాగేనయ్యా” అంది గంగమ్మ.
రోజూ మాస్కుపెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తూ పనికి వెళ్ళేది గంగమ్మ. ఓ రోజు తను పనిచేసే ఇంట్లో తెలిసిన కుర్రాడు వినయ్ లిఫ్టులో మాస్కు పెట్టుకోకుండా కనపడితే “అయ్యా, మాస్కు పెట్టుకోమంటున్నారు. మాయదారి రోగం, మాస్కు పెట్టుకో బాబూ” చెప్పింది గంగమ్మ.
“అవి నీలాంటి ముసలోళ్ళకి లే, ఆ రోగాలు మమ్మల్ని ఏమి చేయవులే గంగమ్మా.” విసుక్కున్నాడు ఇంటర్ చెదివే వినయ్. “ఇంట్లో మీ నాయనమ్మగారు ఉంటున్నారుగా అయ్యా, ఆవిడకోసమైన పెట్టుకోండి బాబూ” అంది గంగమ్మ. కోపంగా చూసి “నీ పని నువ్వు చూసుకో గంగమ్మా. ముసలి సోది” అని కోపగించుకుని లిఫ్టు దిగేసాడు వినయ్. నొచ్చుకుంది గంగమ్మ. చిన్న వయసు, అర్ధం అవ్వదు అని సరిపెట్టుకుంది.
రోజూ పనికొచ్చి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయేది. ఒకరోజు పంటి నొప్పి ఎక్కువగా ఉందని, పనికి రాలేనని కబురంపింది రామయ్యతో గంగమ్మ. వారమైనా రాకపోయేసరికి ఏమైందో కనుక్కుందామని వెళ్ళారు గంగాధరం.
“ఎలా ఉంది రామయ్యా గంగమ్మకు?” అడిగాడు గంగాధరం. షుగరుందిగా అయ్యా, నొప్పి మరి ఎక్కువగా ఉందంటేనూ నాలుగు రోజులనాడు ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చాను. నిన్న రాత్రి నుంచి జలుబు, జ్వరం. చాలా ఇబ్బంది పడుతోందయ్యా ” అన్నాడు దిగులుగా రామయ్య.
అనుమానం వచ్చింది గంగాధరానికి. ఈ దిక్కుమాలిన రోగం కాదు కదా అనుకున్నాడు. ఇంటికెళ్ళి మాస్కులు, గ్లౌజు తెచ్చుకుని దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి, రామయ్య నువ్వు దూరంగా ఉండు, మాస్కు పెట్టుకునే ఉండు అని జాగ్రత్తలు చెప్పి, ఇప్పుడే వస్తాను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, నేను ఏర్పాటు చేస్తాను అన్నారు గంగాధరం.
ఇంటికి వెళ్ళి సునందకు చెప్పారు. “పిల్లల్ని నేను చూసుకుంటాను. వెంటనే ఆసుపాత్రికి తీసుకెళ్ళండి.” ఎలాంటి కాలమొచ్చిపడింది. ఆ పసి పిల్లలకు ఉన్న దిక్కు కూడా లేకుండా చేయకు భగవంతుడా, అని మనసులోనే దేవుడిని వేడుకుంది సునంద.
అంబులెన్స్ కు ఫోన్ చేసి, గంగమ్మను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. దారిలో విపరీతమైన ట్రాఫిక్. ఒక్కరూ దారివ్వరు. ఓపికగా అందరినీ బ్రతిమాలుకుని దారి అడిగి మొత్తానికి ప్రభుత్వ వైద్యశాలకి చేర్చారు. గంగమ్మను అడ్మిట్ చేసుకున్నారు. వెనుక కార్లో వచ్చారు గంగాధరం ఒక్కరే. తరువాత తిరిగి వచ్చేసారు. రామయ్యకు చెప్పటానికి వెళ్ళారు.
“పంటి నొప్పికి, దవడ వాసిందని భయపడి అనవసరంగా ఆసుపత్రికి వెళ్ళామయ్యా! అక్కడికొచ్చిన రోగులు చానామంది మాస్కులు పెట్టుకోలేదయ్యా. చెప్తే కసురుకుంటున్నారు. మా పెద్దోళ్ళ గోడు ఎవరికి కావాలయ్యా. వయసయిపోయినా ప్రాణం మీద తీపి చావలేదు అని కసిరాడు ఒకాయన.
వైద్యానికి ముందూ, తరువాత కాసేపు అది మాస్కు పెట్టుకోలేదు అంతే. వచ్చేవాళ్ళందరికీ డాక్టర్లు సిబ్బందీ చెప్తూనే ఉన్నారు. వినిచావట్లేదయ్యా జనం. తిరిగొచ్చేటప్పుడు తమ నాయకుడెవరో వస్తున్నారని ఊరేగింపు జరిగిందయ్యా. చానా మంది మొహాన మాస్క్ లేదు. మేము పక్కకు తప్పుకున్నాము. అయినా జనం రద్దీలో మా గంగమ్మను ఎవరో తోసారు, మాస్కు కిందపడింది. ఎవరో తొక్కేసారు. ఎవరికోసమయ్యా ఈ ఊరేగింపులు? దూరంగా ఉండండి అని వాళ్ళే చెప్తారు, వాళ్ళే ఇయ్యేమీ పాటించరు. మాస్కే కదయ్యా పెట్టుకోమంది, అదంత కష్టమా?!”ఏడ్చేసాడు బాధ చెప్పుకుంటూ రామయ్య గంగాధరం తిరిగి వచ్చాక
నీవి పిల్లలవి పరీక్షా ఫలితాలు వచ్చేవరకు బయటకు రాకు రామయ్యా అని చెప్పి ఇంటికి వెళ్ళాడు గంగాధరం. భోజనం ముగ్గురికి ఇంటికి తెచ్చి బయటే ఉంచి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు.అమ్మమ్మ గురించి అడిగి, రేపొస్తుందని చెప్తే నిద్ర పోయారు పిల్లలు.
తరువాతి రెండు రోజులు పెద్దగా వివరాలు తెలియలేదు. కరోనా అని మాత్రం తరువాతి రోజు చెప్పారు. రామయ్యకూ పిల్లలకూ పరీక్షలు చేయగా తరువాత రెండు రోజులకు వారికి కరోనా సోకలేదని ఫలితం వచ్చింది. మూడో రోజు సాయత్రం గంగాధరం వచ్చారు రామయ్య ఇంటికి.
“ఆసుపత్రికి వెళ్దాము బయలుదేరు రామయ్యా. పిల్లల్ని సునంద చూసుకుంటుంది”అన్నారు గంగాధరం. “తగ్గిందంటనా అయ్యా గంగమ్మకు” ఆశగా అడిగాడు రామయ్య. ఏమీ మాట్లాడలేదు గంగాధరం. తన కార్లోనే అస్సుపత్రికి చేరుకున్నారు ఇద్దరూ. రామయ్యకు ఏదో కీడు శంకించింది. భగవంతుడా దానికేమీ కాకుండా చూడు అని వేడుకున్నాడు.
“గంగమ్మ ఇక మనకు లేదు రామయ్యా. కాగితాల మీద సంతకాలు చెయ్యాలి. ఆవిడ శవాన్ని ఇంటికి ఇవ్వరు” విషయాన్నీ దుఃఖం ఆపుకుంటూ చెప్పారు గంగాధరం.
గుండె పగిలిపోయింది రామయ్యకు. ఆయనను ఓదార్చటం గంగాధరం తరం కాలేదు.
“నేను పోయినా బాగుండేదయ్యా. ఆ పిల్లలకు దేనికీ ఉపయోగపడను. మాకున్న ఒకే ఒక దిక్కయ్యా అది. ఎవరో అశ్రద్ధకి అది బలైపోయిందయ్యా. ఎవరికి పడతాయయ్యా మా బాధలు. దిక్కులేనివాళ్ళయ్యారయ్యా అ పిల్లలు.” ఏడ్చి ఏడ్చి నీరసించిపోయాడు రామయ్య.
రేపటి పరీస్థితి ఏమిటో ఆయనకు అర్ధంకాని ప్రశ్నలా మిగిలింది.
ఎవరి అశ్రద్ధకు ఎవరు బలౌతున్నారు?!
శశిరేఖ — 5
“అమ్మా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ముందుగా నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నేను శశికి పై చదువులు చదవటానికి తోడుగా నిలబడాలి అనుకుంటున్నాను. మాస్టారుగారికి చాలా బలంగా తన కూతురిని చదివించాలి అని ఉండేది. పరిస్థితులు అనుకూలించలేదు. నాకు తెలుసు నాన్నగారు ఇందుకు ఒప్పుకోరు అని. కాని ఆయనకి నేను చెప్పుకోగలను. ఆయన డబ్బు ముఖ్యం అనుకునే మనిషేగాని, డబ్బే ముఖ్యం అనుకునే మనిషి కాదు.”మౌనంగా వింటోంది సుజాత. “చిన్నప్పటి నుంచీ తెలిసిన కుటుంబం. మనమేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటో మనకు తెలుసు. మృదుస్వాభావులు. మంచి, చెడు తెలిసిన కుటుంబం. నేను ఎన్నో సార్లు సాయం చేస్తాను అని చెప్పినా, ఏ సాయమూ తీసుకోలేదు శశి. కష్టం, సుఖం తెలిసిన వాళ్ళు. నాకు శశి అంటే ఇష్టం, గౌరవం, అభిమానం. అందమో, ఆస్థో నాకు ముఖ్యం కాదు. బయటి నుంచి ఏ సంబంధం తెచ్చినా మంచి అమ్మాయే రావచ్చు, కాని ఆ అమ్మాయి శశి అవ్వదు. తనకు చదువులోనే కాదు, జీవితాంతం తోడుగా ఉంటాను. నీ అభిప్రాయాం చెప్పమ్మా”. అంతా విన్న సుజాత “శశి చాలా మంచి పిల్లరా. ఉద్యోగం చేస్తున్నావు, ప్రపంచాన్నీ చూస్తున్నావు. మంచీ, చెడూ నీకు తెలుసు. మీ నాన్నగారింటికి వచ్చినప్పుడు, నేను ధనవంతుల ఇంటికి ఏమీ రాలేదు. ఇప్పుడు బాగానే అభివృద్ధి చెందాము కదా. శశిలాంటి అమ్మాయి ఇంటికి వస్తుందంటే సంతోషమే” సంతోషంగా చెప్పింది సుజాత. “ముందు శశి అభిప్రాయం అడుగుతాను. తనకీ ఇష్టమైతే, నాన్నగారికి చెప్తాను. ఆయనను ఒప్పించాకే, పెళ్ళి. ఎంత కాలమైనా పర్లేదు.”స్థిరంగా చెప్పాడు రవి.
రాణి ఉత్తరం వ్రాసింది లక్ష్మికి. రాజేశ్వరికి సంబంధం కుదిరిందని, చందూ ఉద్యోగంలో చేరాడని చెప్పింది. వీలు చూసుకుని త్వరలోనే వస్తామని, శశికి చందూకి పెళ్ళి చేయటం గురించి ఆలోచించమని, ఒకసారి శశిని అడిగి చూడమని సారాంశం. ఉత్తరం చదివిన లక్ష్మి ఆనందపడింది. ఏదో పని మీద బయటికి వెళ్ళిన శశి ఇంటికి రాగానే విషయం చెప్పింది లక్ష్మి, శశి సమాధానం కోసం చూస్తూ, ఉత్తరం చేతికిచ్చి చదవమంది. “చందూ బుద్ధిమంతుడు, మనకు తగిన సంబంధం. ఉద్యోగంలో స్థిరపడ్డాడు. నిన్ను ప్రేమగా చూసుకుంటారు. వద్దని చెప్పటానికి నాకేమీ కారణం కనపడలేదు” ఆలోచించి నిర్ణయం చెప్పు అంది. ఉత్తరం తీసుకుని మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది శశి. తనకేమి చెప్పాలో అర్ధం కాలేదు. తరువాత కాసేపటికి “నాకు కొంత సమయమివ్వు అమ్మా.”అని మాత్రం అడిగింది. సరేనంది లక్ష్మి.
ఆ రాత్రంతా శశి ఆలోచిస్తూ ఉండిపోయింది. తరువాత రోజు బయలుదేరి వచ్చాడు రవి. రవిని పలుకరించి క్షేమ సమాచారాలు అడిగింది లక్ష్మి. “శశి లేదా అండీ?”అడిగాడు రవి. ఉందయ్యా “శశీ ఎక్కడున్నావు, రవి వచ్చాడు”పిలిచింది లక్ష్మి. శశి బయటకు వచ్చింది. వంట చేస్తానయ్యా భోజనం చేసెళ్దువు, అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. “శశీ, నేను చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నీతో. నీకు ఇబ్బంది కాదేమో అనుకుంటున్నాను. నేనూ, నా తల్లితండ్రుల నీకు చిన్నప్పటినుంచి తెలుసు. నా చదువైంది, పర్లేదు బాగానే స్థిరపడ్డాను. నాకు మాస్టారు గారన్నా, మీ కుటుంబమన్నా చాలా గౌరవం అభిమానం. నా దగ్గర నాన్నగారు పెళ్ళి ప్రస్థావాన తెచ్చిన ప్రతీ సారీ నువ్వే గుర్తొచ్చావు. అప్పుడు నాకు స్పష్టత లేదు, అర్ధమాయ్యేది కాదు. ఇప్పుడు ఉంది. నీకు ఇష్టమైతే, ఇంకో అడుగు ముందుకేసి జీవితాంత0 కలిసి బ్రతుకుదాం. నీకిష్టైమనంత వరకు చదువు, నీకు నచ్చిన ఉద్యోగంలో స్థిరపడు. ఆన0దంగా తోడుంటాను. నీ అభిప్రాయం ఏదయినా పర్లేదు. తొందరేమీ లేదు. ఆలోచించుకుని చెప్పు”చెప్పాడు రవి.
అంతా విన్న శశి కాసేపు అది ఆనందమో, ఆశ్చర్యమో అర్ధం కాని భావనలో ఉండిపోయింది. తేరుకున్ “నాకేమి చెప్పాలో తోచట్లేదు ఇప్పుడు మా మీద మీకున్నది జాలేమో రవి. రేపు ఆ జాలి తగ్గాక, నేను మీకు సరి కాదనిపిస్తానేమొ. మీ చదువు, హోదాకు తగిన అమ్మాయి వస్తుంది.”చెప్పటం ఆపింది శశి. “జాలేస్తే డబ్బు సాయమో, అప్పో ఇస్తాను శశి. పెళ్ళి చేసుకుంటాను అని అడగను. నాకు మంచి అమ్మాయే దొరకవచ్చు, కానీ ఆ అమ్మాయి శశి అవ్వదు.” అన్నాడు రవి స్థిరంగా. తల పైకెత్తి చూసాడు. శశి కళ్ళల్లో తడి, ఆనందం. “ఈ రోజు అసలు రాదేమో అనుకున్నాను. మీ అంత స్పష్టంగా, ధైర్యంగా, గొప్పగా, స్వేచ్ఛగా చెప్పలేనేమో. నాకు కష్టమొచ్చినప్పుడూ, ఆన0దంలోనూ మీరే గుర్తొచ్చారు. పెళ్ళి అని అడిగిన ప్రతీసారీ అమ్మకు ఏమీ చెప్పలేకపోయాను. ఇంతకు మి0చి నేనేమీ చెప్పలేను. అమ్మ ఏమంటుందో తెలియదు.” అంది శశి. ఇదంతా వింటూనే ఉంది లక్ష్మి.
బయటకు వచ్చింది. “అంతా విన్నాను రవి. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. మీ తల్లితండ్రులకు చెప్పావా?”అడిగింది లక్ష్మి. “అమ్మకు చెప్పానండీ, శశి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. నాన్నకు కూడా చెప్తాను. ఆయనను ఒప్పించగలను అన్న నమ్మకం నాకుంది. తేలిక కాదని తెలుసు. కొంత సమయం పడుతుంది. మీకు సందేహాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాని ఒక్క మాట మాత్రం చెప్పగలను మాస్టారుగారుంటే శశిని ఎలా చూసుకునేవారో, అంతే ప్రేమగా నేనూ చూసుకోగలను.”
లక్ష్మికి సందేహాలు వీడిపోయాయి. శశికి ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదని చెప్పింది. శశి వైపు చూసాడు రవి. శశి కళ్ళలో కోటి కాంతుల వెలుగులు. అది అంగీకారమని అర్ధమైంది రవికి. “నాకు ఎం.బి.ఏ చదివే ఆలోచన ఉంది. ఎంట్రన్స్ వ్రాస్తున్నాను. శశి కోసం కూడా కొన్ని చదువుల వివరాలు కనుక్కున్నాను. అవన్ని ఇచ్వి వెళ్తాను. తను కోరుకున్న మొదటి అడుగు ఇదే కావాలి. కలిసి తోడుగా నీడగా ముందుకు సాగుతాం”అంటూ ఆనందంగా లేచాడు రవి. మళ్ళీ వస్తనమ్మా, అంటూ బయలుదేరిపోయాడు రవి. రవి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది “శశిరేఖ”, తన తండ్రిని తలుచుకుంటూ..
“శశిరేఖతో నా ప్రయాణం సమాప్తం”
శశిరేఖ — 4
అంతా మౌనంగా విన్నాడు రవి. కళ్ళవెంట నీళ్ళొస్తున్నా కష్టం మీద తమాయించుకున్నాడు. చూస్తే శశి బాధ ఎక్కువౌతుందనిపించింది రవికి. కాసేపు అలాగే కూర్చుండిపోయారు ఇద్దరూ. “నీ చదువు ఎలా సాగుతోంది శశీ?” మార్పు కోసం అడిగాడు రవి. “డిగ్రీ లో చేరాను, ఇంకా మొదలు కాలేదు”. “ఫీజు సంగతి.. “ అంటూ ఆగిపోయాడు రవి. “నాన్నగారి పెన్షన్ వస్తోంది, టౌనులో ఉండే చిన్న కాలేజ్ ఏ కదా, కట్టేయగలను, విపరీతంగా ఫీజులు అయితే ఉండవు” ట్యూషన్లు కూడా చెప్తున్నాను, అమ్మకీ నాకూ సరిపోతున్నాయి” చెప్పింది శశి. మాస్టారుగారు కోరుకున్నది వేరు కదా అనుకున్నాడు రవి. “శశీ ఒక మాట చెప్తాను, విను. నువ్వు బాగా చదవగలవనీ, నిన్ను పెద్ద చదువులు చదివించాలని మాస్టారుగారికి బాగా బలమైన కోరిక ఉండేది. డిగ్రీ లో చేరుతున్నావు కాబట్టి శ్రద్ధగా చదువు. డిగ్రీ తరువాత కూడా ఇప్పుడు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంతో నా చదువు పూర్తవుతుంది. ఉద్యోగం వస్తుంది. ఆర్ధికంగా స్థిరపడతాను. అప్పటి నుంచి నీకు ఏ సహాయం కావలన్నా నన్ను మర్చిపోవద్దు. నీకు ఎప్పుడు మనసుకి బాధ కలిగినా నాకు ఫోన్ చేయి. కాలేజ్ దగ్గర ఎస్.టి.డి బూత్ ఉంటుంది కదా. నా హాస్టల్ నంబరు ఇస్తాను. మా ఇంటి నంబరు ఎలాగూ ఉంది మీ దగ్గర. నేను ఉత్తరాలు వ్రాస్తూంటాను, నీకు కుదిరినప్పుడు బదులిస్తూ ఉండు. మీ ఇద్దరూ ఇలా దిగులుగా ఉండటం మంచిది కాదు” అన్నాడు రవి. శశి ఏమి బదులివ్వలేదు. “మీకు ఇప్పుడు నేను చేయగలిగిన పనులేమైనా ఉన్నయా శశి? అవసరమైతే ఈ రోజు హోటెల్ లో ఉంటాను, రేపు వెళ్తాను “ అన్నాడు రవి. “ఏమి లేవండీ, మీరు వెళ్ళిపోవచ్చు ఈ రోజే.” బదులిచ్చింది శశి. శశి “మీరు”అని సంబోధించటం చిత్రంగా, పరాయి వ్యక్తిని పిలిచినట్టు అనిపించింది రవికి.కాలంతో, వయసుతో వచ్చిన మార్పు అనుకుని ఊరుకున్నాడు.
సాయంత్రమైంది. లక్ష్మి లేచి వసారా లోకి వచ్చి నిల్చుంది. కాసేపు మౌనంగా ఉన్నారు ముగ్గురూ. “నేను బయలుదేరతానమ్మా. ఇద్దరూ జాగ్రత్త. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా నన్ను మర్చిపోవద్దు” చెప్పాడు రవి. సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. జరిగిందంతా సుజాతకు చెప్పాడు. ఆవిడ చాలా బాధపడింది. “శశి వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి ఫోన్ చేస్తే నాకు చెప్పటం మర్చిపోకమ్మా”చెప్పాడు రవి. తండ్రి వచ్చాక, ఊరెళ్ళిన సంగతి, మాస్టారుగారి గురించి చెప్పాడు రవి. శ్రీనివాస్ గారు “అలాగా! నువ్వు బొంబాయి ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగి సమాధానం కోసం చూడకుండా తన గదికి వెళ్ళిపోయారు. రెండు రోజులకి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు రవి.
బాగా దిగులుగా ఉండి, చిక్కి శల్యమైపోయిన శశే గుర్తొచ్చింది కొన్ని రోజులు రవికి. తానేమి చేయలేకపోతున్నానన్న భావన బాగా ఇబ్బంది పెట్టింది రవిని. నెల రోజులకి ఉత్తరం వ్రాసాడు రవి క్షేమ సమాచారాలు కనుక్కునంటూ. మాస్టారు ఉన్నప్పుడు వ్రాయటం వేరు ఇప్పుడు వేరు. శశి సమాధానం ఇస్తుందో లేదో అన్న సందేహమూ వచ్చింది. మరోసారి ఉత్తరంలో హాస్టల్ నంబరు, తన చిరునామా వ్రాసాడు. దిగులుపడవద్దని చెప్పాడు.
శశి గురించి తానెందుకిలా దిగులుపడుతున్నాను అనిపించింది రవికి కాసేపు. మాస్టారుగారి అమ్మాయి కదా ఆయనంటే అభిమానం కదా అని సరిపెట్టుకున్నాడు. తన చదువైపోయాక ఉద్యోగంలో స్థిరపడ్డాక శశికి పై చదువులకు సాయం చేయాలనుకున్నాడు. శశికి ఉత్తరాలు వ్రాయటం ఆపకూడదనుకున్నాడు.
ఉత్తరం చదివింది లక్ష్మి. ఇంటికి వచ్చాక కాసేపటికి శశికి ఇచ్చింది. శశి చదివింది. “రవి మంచి అబ్బాయి. మంచి మనసు ఉన్నవాడు. అతనికి మీ నాన్నగారంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో ఉత్తరాలు వ్రాస్తున్నాడు” అంది లక్ష్మి. విని ఊరుకుంది శశి. తిరిగి జవాబు వ్రాయలేదు శశి. ఎదురుచూసి, ఉత్తరం రాకపోయేసరికి, తానూహించిందే జరిగింది అనుకున్నాడు రవి. మళ్ళీ నెల రోజులాగి ఇంకో ఉత్తరం వ్రాసాడు. మళ్ళీ జవాబు లేదు.
ఆదివారం నాడు మాస్టారుగారి పెద్ద చెల్లెలు రాణి, రాజేశ్వరి వచ్చారు రెండు రోజులు ఉండేలా. రాజేశ్వరి ఏవో కబుర్లు చెప్తూ శశిని ఉత్సాహపరచటానికి ప్రయత్నించింది. ఇద్దరూ వెనుక పెరట్లో కూర్చున్నారు. రాజేశ్వరి కబుర్లు చెప్తూనే ఉంది. “వదినా, అన్నయ్య జ్ఞాపకాల్లోనుంచి బయటకు రావటానికి నీకు సమయం పడుతుంది, కాదనను. కాని శశి గురించి కూడా ఆలోచించాలి నువ్వు. ఇంకో రెండేళ్ళలో శశి చదువు పూర్తౌతుంది. మా రాజీ చదువు కూడా. మీ అన్నయ్య సంబంధాలు చూస్తున్నారు రాజీకి. డిగ్రీ పూర్తవగానే చేసేయాలని పట్టుదలతో ఉన్నారు.” చెప్తూ ఆగింది రాణి. “శశికి కూడా చేసేయాలి వదినా అంది” రాణి. ఔనన్నట్లు తలూపింది లక్ష్మి. మా చందూ కి ఈ సంవత్సరం డిగ్రీ అయిపోతుంది. బాగానే చదువుతాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలి అనుకుంటున్నాడు తరువాత బి.ఎడ్ చేసి. బుద్ధిమంతుడు” అని చెప్పింది రాణి. ఇంకేమి పొడిగించలేదు.
రెండు రోజులు ఉండి వీలైనంతగా వారికి మార్పు కలిగించాటానికి ప్రయత్నించారు ఇద్దరూ. రాజేశ్వరి శశికి ఫోన్ చేయమని మరీ, మరీ చెప్పింది. శశి కూడా రాజేశ్వరి నంబరు తీసుకుంది. రెండు రోజులుండి వెళ్ళిపోయారు ఇద్దరూ. నెల తరువాత కాలేజ్ దగ్గరున్న ఫోన్ బూత్ కు వెళ్ళి ఫోన్ చేసింది రాజేశ్వరికి శశి. “హెల్లో ఎవరండి” అన్నాడు అటు నుంచి ఫోన్ తీసిన చంద్ర శేఖర్(చందు). మొదటిసారి ఫోన్ మాట్లాడటం వల్ల తడబడుతూ “నేను శశి నండీ, రాజేశ్వరి ఉందా అండీ” అడిగిండి శశి. “ఉందండీ పిలుస్తాను. మీరు అత్తయ్య ఎలా ఉన్నారు? ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది?” కుశల ప్రశ్నలు వేసాడు చందూ. బాగున్నామండీ అని చెప్పింది శశి. రాజేశ్వరి వచ్చింది “హమ్మయ్య, ఫోన్ చేయవేమో, దిగులుగా కూర్చుంటావేమో అనుకున్నాను. మొత్తానికి ఫోన్ చేసావు. అత్త ఎలా ఉంది? నీ చదువు ఎలా సాగుతోంది?”అంటూ ప్రశ్నలు సంధించింది రాజేశ్వరి. “బాగున్నాము. చదువు కూడా పర్లేదు. ఇద్దరు మంచి స్నేహితులు కూడా అయ్యారు. వాళ్ళే ఇప్పుడు నాకు కాస్త మార్పు”చెప్పింది శశి. కాసేపు మాట్లాడి ఉత్తరాలు వ్రాస్తాను అని చెప్పి పెట్టేసింది శశి.
కాలేజిలో ఇద్దరి స్నేహితుల వల్ల కాస్త మార్పు వచ్చింది శశి లో. అప్పుడప్పుడూ రవి ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. శ్రద్ధగా చదివేది శశి. ఒక్కోసారి జవాబివ్వాలనిపించేది శశికి. మళ్ళీ తల్లి ఏమంటుందో అన్న సంశయంలో ఉండిపోయేది. ఓ రోజు విపరీతమైన జ్వరంతో అనారోగ్యం పాలైంది లక్ష్మి. స్నేహితురాళ్ళ సాయంతో వైద్యశాలకి తీసుకెళ్ళింది, రెండు రోజులు ఉంచమన్నారు అక్కడే.భయపడిపోయింది శశి. ఏడ్చేసింది ఒంటరిగా కూర్చుని. ఎందుకో తెలియదు రవితో మాట్లాడాలనిపించింది ఒక్కసారిగా. తల్లికేమౌతుందోనన్న భయం ఎక్కువైంది. నంబరు వెతికి రవికి ఫోన్ చేసి విపరీతంగా ఏడ్చేసింది శశి. ప్రశాంతంగా విని, తల్లికేమీ కాదని ధైర్యం చెప్పి ఓదార్చాడు రవి. తాను సెలవు పెట్టి వస్తానన్నాడు. “నీ చదువుకి ఇబ్బందౌతుంది. రావద్దు.” అవసరమైతే మళ్ళీ తానే ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసింది శశి. కాసేపు రవికి ఫోన్ చేసినందుకు తనకు వింతగా అనిపించింది. రాజెశ్వరికి కూడా ఫోన్ చేసి చెప్పింది. రెండు రోజులకి కోలుకుంది లక్ష్మి. రాజేశ్వరి, రాణి వచ్చారు. ఇంటికి తీసుకువెళ్ళారు లక్ష్మిని. రెండు రోజులుండి వెళ్ళిపోయారు. లక్ష్మి కోలుకుంది.
రవి ఉత్తరం వచ్చింది మళ్ళీ. ఇంకో రెండు నెలల్లో తన చదువు పూర్తౌతుందని. మన రాష్త్రంలోనే పెద్ద నగరం లో ఉద్యోగం లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్తూ వ్రాసాడు. శశి కూడా చదివింది ఆ ఉత్తరం. ఆనందపడింది రవి ఎదుగుదల గురించి లక్ష్మి. మొదటి సంవత్సరం పూర్తైంది. రవి చదువూ పూర్తైంది. తరువాత ఉద్యోగమూ వచ్చింది. హుషారుగా ఇంటికి వచ్చాడు. తల్లికి చెప్పి ఆనందపడ్డాడు. తండ్రి కూడా ఆనందపడ్డాడు. కొంత కాలం ఇంట్లోనే ఉన్నాడు. ఊరెళ్ళి శశీ వాళ్ళను చూసి వస్తాను అన్నాడు. తండ్రి ససేమీరా వద్దన్నాడు. ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు. ఎంత అడిగినా ఆయన ఒప్పుకోలేదు. మౌనంగా ఉండిపోయాడు రవి. తమ స్థాయికి తగ్గ సంబంధం చూసి 2–3 ఏళ్ళలో పెళ్ళి చేస్తానన్నాడు. రవికి పరిస్థితి అర్ధమైంది. శశి వాళ్ళకు తాను చాలా తోడుగా నిలవాలనుకున్నాడు. శశికి పై చదువులు చదవటానికి సాయమందిచాలని ఆశించాడు. ఇప్పుడెలాగా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎలాగైనా శశికి ఊతమివ్వాలని నిర్ణయించుకున్నాడు. మరి శశి ఏమంటుందో అనుకున్నాడు. కొంత కాలం ఉండి ఉద్యోగంలో చేరటానికి వెళ్ళిపోయాడు.
అక్కడినుంచి ఉత్తరాలు వ్రాసేవాడు. సెల్ ఫోన్లు, ఈ-మెయిల్స్ వచ్చాయని, ముందు ముందు మాట్లాడుకోవటం చాలా సులభమని వ్రాసేవాడు ఉత్తరాల్లో. కాలం గడిచిపోయింది శశి డిగ్రీ ఆఖరు సంవత్సరం కు వచ్చేసింది.రవి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
“రవి గురించి ఎక్కువగా ఆలోచించకు శశి. అతను డబ్బున్నవారి ఏకైక సంతానo. బాగా చదువుకున్నాడు కూడా. మంచి స్థితిలో ఉన్నాడు. వాళ్ళ తల్లితండ్రులకూ చాలా ఆశలుంటాయి. మన పని మనం చూసుకోవాలి. నీకు సంబంధాలు చూడటం మొదలు పెడతాను.”చెప్పింది లక్ష్మి. “నాకిప్పుడే పెళ్ళి వద్దమ్మా. నేనూ చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడతానమ్మ. నాన్నగారు కోరుకున్నట్లు పెద్ద చదువులు చదవకపోయినా ఉద్యోగం మాత్రం చేయాలని ఉందమ్మా నాకు” అర్ధిస్తున్నట్లు అడిగింది శశి. “తగిన సంబంధం దొరికే వరకు చదువుకో. మనం పెద్ద పెద్ద కట్నాలు ఇవ్వలేము. ఉన్నంతలో మంచిది దొరికినప్పుడు మాత్రం కాదనకు. తారువాత సంగతి తరువాత. నా ఆరోగ్యమూ బాగుండట్లేదు “చెప్పింది స్థిరంగా లక్ష్మి.
శశి డిగ్రీ మంచి మార్కులతో ఉత్తిర్ణురాలైంది. చంద్ర శేఖర్ కు చదువు పూర్తై ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగమూ వచ్చింది. రవి కొన్ని రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు.
— — సశేషం.
శశిరేఖ — 3
శశి 10వ తరగతి కి వచ్చింది… చదువుమీద శ్రద్ధ పెట్టింది.
“భోజనానికి రండి శశీ నువ్వూ, మీ నాన్నగారూ”పిలిచింది లక్ష్మి.రాత్రి 7:00గం.ల వార్తలకు టి.వి పెట్టుకుని ముగ్గురూ భోజనాలకి కూర్చున్నారు. టి.వి లో వార్తలు చూస్తూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. తరువాత తల్లి వంటగదిలో సర్దుకుంటూంటే వెళ్ళింది శశి. “అమ్మా మంచి మర్కులు తెచ్చుకుంటే నన్ను ఎక్కడ చేర్పిస్తారు ఇంటర్?” కుతూహలంగా అడిగింది శశి. “మనం పెద్ద పెద్ద ఫీజ్ లు కట్టలేమమ్మా. పక్క టౌనులో ఉన్న కాలేజ్ లో చదువుకుందువుగాని. రోజూ ఇంటి నుంచే వెళ్ళిరావచ్చు. నీకెప్పుడూ చెప్పలేదు. మీ నాన్నగారి చదువు పూర్తయ్యే సమయానికి మీ తాతగారు చనిపోయారు. ఉద్యోగం సంపాదించుకుని ఆయనే తన ముగ్గురు చెల్లెళ్ళకి, తమ్ముడికి తండ్రయ్యారు. వారందరినీ స్థిరపరిచారు. కొద్దో గొప్పో అప్పులు కూడా అయ్యాయి. అవన్ని క్రమంగా తీర్చేసారు. ఆయన ఆరోగ్యమూ అంత బాగుండట్లేదు ఇప్పుడు.” చెప్తూ ఆగింది లక్ష్మి ఆలోచిస్తూ. “నా స్నేహితురాళ్ళు ఎక్కడ ఇంటర్ చేరుతున్నారో చెప్తుంటే, తెలుసుకుందామని నిన్ను అడిగానమ్మా. నేను పక్క టౌను కాలేజ్ లో చదువుకుంటానమ్మ, ఎంచక్క ఇంటి నుంచే వెళ్ళి రావచ్చు” చెప్పేసి వెళ్ళిపోయింది శశి. రోజూ తండ్రి దగ్గరే కూర్చుని భోజనాలయ్యక ముచ్చట్లు చెప్పేది శశి. వీళ్ళిద్దరూ, తండ్రీ కూతుళ్ళా, స్నేహితులా, గురు శిష్యులా అనిపించేది లక్ష్మికి.
“మాత్రలు వేసుకున్నారా?” అడిగింది లక్ష్మి. “వేసుకున్నాను” చెప్పారు శంకరంగారు.”ఈ మధ్య కాస్త నడిచినా ఆయాసంగా, నీరసం గా ఉంటోంది అంటున్నారు. షుగరు, బి.పి ఉన్నాయి, ఒకసారి పెద్ద డాక్టర్గారి దగ్గరకి వెళ్దామండి” అంది లక్ష్మి. “వెళ్దాములే, తొందరేమీ లేదు”అన్నారు శంకరంగారు. కొత్త కాలేజ్ విశేషాలు, బొంబాయి విశేషాలు తెలుపుతూ ఉత్సాహంగా ఉత్తరం వ్రాశాడు రవి. తన చిరునామా కూడా పంపించాడు మాస్టారుగారిని ఉత్తరాలు వ్రాస్తూ ఉండమని కోరాడు. శశిని బాగా చదువుకోమని చెప్పాడు.
తండ్రి శిష్యరికంలో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది శశి. జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్ర స్థాయిలోను మంచి మార్కులు సంపాదించింది శశి కూడా. ఇంటర్ పక్క టౌనులో చేరింది.
ఓ రోజు ఉత్తరం వచ్చింది సుజాత దగ్గరినుంచి. కొత్త ఇల్లు కట్టుకున్నాము పట్నం లో తప్పకుండా గృహప్రవేశానికి రావాలని, రవి కూడా ఇంటికి వస్తున్నాడని సారంశం. లక్ష్మిని, శశిని కూడా తీసుకురమ్మని మరీ, మరీ కోరింది. ముగ్గురూ పట్నం వచ్చి అడ్రసు వెతుక్కుని చేరారు. అంతకు ముందెప్పుడూ పెద్ద నగరాలు చూడని శశి ఆశ్చర్యంగా, హుషారుగా పట్నం ను గమనిస్తూ ఉండిపోయింది శశి. వారిని చూడగానే ఆనందంగా ఆహ్వానించింది సుజాత. “రవీ, ఎవరొచ్చారో చూడు” అంటూ పిల్చింది రవిని సుజాత. మాస్టారుగారికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేసాడు రవి. శ్రీనివాస్ గారు మాత్రం ముక్తసరిగా పలకరించి ఊరుకున్నారు. ఆయన స్వభావం తెలిసిన శంకరంగారు నవ్వి ఊరుకున్నారు. భోజనాలయ్యాక మాస్టారుగారికి చుట్టుపక్కల చూపించి తీసుకొస్తాను ఆని రవి తీసుకెళ్ళాడు. “శశి చాలా మచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది గా మాస్టారు ఇక్కడ చేర్చవలసింది కదా, అక్కడ బాగుండదని కాదు. ఇక్కడైతే ఇంజినీరింగులో అర్హత సాధించటానికి కూడా ప్రత్యేకంగా చెప్తారు.”అన్నాడు రవి. “ఔను రవి, నీలాగే తనూ మంచి మార్కులు తెచ్చుకుంది. తనకీ పెద్ద చదువులు చదవాలని ఉంది. నా ఆరోగ్యం అంత బాగుండట్లేదు రవి. అప్పు చేసి చదివించవచ్చు, కాని నాకేదైనా అయితే, వాళ్ళని అప్పుల్లో వదిలేసి వెళ్ళినవాడిని ఔతాను. సామాన్యంగా ఇవన్నీ ఎవరితోనూ పంచుకోను. నా తోడబుట్టిన వాళ్ళందరికి నాకు తోచినంత న్యాయం చేయగలిగాను కానీ, శశికే ఏమీ చేయలేకపోతున్నాను. పెద్ద చదువులు చెప్పిస్తే పెద్ద కట్నాలు ఇవ్వాలి.” అన్నారు బాధగ. సర్లే ఇవన్ని ఎందుకు గానీ… నీ చదువు కబుర్లు చెప్పు అన్నారు మాట మారుస్తూ శంకరం గారు. వింటున్నాడు రవి అంతే బాధగా.
ఆయన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనూ తన చదువు విషయాలు చెప్పి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఆరోగ్యం అంత బాగుండక రవి వ్రాసే ఉత్తరాలకు జవాబు ఇవ్వలేకపోయారు మాస్టారు. తండ్రిని చూస్తే దిగులనిపించేది శశికి. “నాకేం కాదులే తల్లీ, నువ్వెక్కువ ఆలోచించకు”అనేవారు శంకరంగారు. శశి ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగానే మాస్టారుగారు గుండెపోటుతో కాలం చేసారు. లక్ష్మి శోకదేవతే అయ్యింది. మాస్టారుగారి తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళు వచ్చారు. శశికి ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. ఎవరు పలకరించినా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయేది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్ధమయ్యేది కాదు. పెద్ద అత్త కూతురు రాజేశ్వరే శశి కూడా ఉంటూ ఓదారుస్తూ వచ్చింది. రెండు వారాల తరువాత ధైర్యంగా ఉండమని చెప్పి అందరూ వెళ్ళిపోయారు.
ఇల్లు మూగబోయింది. తల్లిని చూస్తే బాధ అధికమయ్యేది శశికి. ఇలాగే ఉంటే ఆవిడ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందేమోనని భయ పడింది. తనకు తానే ధైర్యం కూడదీసుకుని, తిరిగి కాలజ్ కు వెళ్ళటం మొదలు పెట్టింది. సాయంత్రం పిల్లలకు తనే పాఠాలు చెప్పటం మొదలు పెట్టింది. రాజేశ్వరి ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. మెల్లగా కొన్ని నెలలకు కోలుకుంది లక్ష్మి. కూతురికి ఈ ప్రపంచలో ఉన్న ఒకే ఒక తోడు ఇక తానే అని విషయం స్ఫురించింది లక్ష్మికి. ధైర్యాన్ని కూడదీసుకుంది. తండ్రి చుట్టునే ఎప్పుడూ తిరుగుతూ ఉండే శశి అసలు ఎలా తట్టుకోగలుగుతోంది ఈ బాధను అని అనుకునేది లక్ష్మి.
ఇంటరు మంచి మార్కులతో ఉతీర్ణురాలైంది శశి, కాలెజ్ లోనే ప్రధమ స్థానంతో. “డిగ్రీలో చేరతానమ్మ, తరువాత ఏదయినా ఉద్యోగం వెతుక్కుంటాను” అంది శశి. సరే నంది లక్ష్మి. “ఏదయినా మంచి సంబంధం వస్తే మాత్రం పెళ్ళి చేసేస్తాను, నీకు ఒక తోడు దొరుకుంతుంది నేను ఉండగానే” అంది లక్ష్మి. చూస్తూ ఉందిపోయింది శశి.
ఆఖరు సంవత్స్రంలో కి వచ్చాడు రవి. ఇంటికి వచ్చాడు. “మాస్టారుగారి కబుర్లేమైనా తెలిశాయా అమ్మా? నాకు ఉత్తరాలు రావట్లేదు”అన్నాడు రవి. “ఏమో తెలియదు రవీ”చెప్పింది సుజాత. “ఇంకెన్నాళ్ళు రా వాళ్ళ కబుర్లు, వేరే పని లేదా, విసుక్కున్నాడు శ్రీనివాస్ గారు”. నీకు చదువై ఉద్యోగం వచ్చాక, మన స్థాయికి తగ్గ సంబంధం చూసి పెళ్ళి చేసేస్తాను” అన్నారు శంకరం గారు. “నాకిప్పుడు ఆ ఆలోచన లేదు నాన్నా”అన్నాదు రవి. వినిపించుకోనట్లు వెళ్ళిపోయారు శ్రీనివాస్ గారు. “అమ్మా ఒక్కసారి ఊరెళ్ళి యోగక్షేమాలు కనుక్కుంటాను, ఏమైందో తెలియట్లేదు. ఆయన ఆరొగ్యం కూడా అంత బాగుందేది కాదు”అన్నాడు రవి. “మీ నాన్న ఒప్పుకోరురా, వాళ్ళ ప్రస్థావనే ఇష్టపడట్లేదు ఆయన.”అంది సుజాత. “ఆయనకి నేను చెప్పుకుంటానులే”అంటూ ఆ వచ్చే ఆదివారం రోజే బయలుదేరి వెళ్ళాడు రవి.
తలుపు కొడుతున్న చప్పుడు విని తలుపు తీసింది శశి. బాగా చిక్కిపోయి, నీరసంగా కనిపించింది శశి. కూర్చోమని చెప్పి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. లక్ష్మి కూడా వచ్చి కూర్చుంది. మాస్టారుగారు కనపడకపొయేసరికి బయటకు వెళ్ళారా అని అడిగాడు రవి. ఒక్కసారిగా బాధను ఆపుకోలేకు ఏడ్చేసింది లక్ష్మి. మౌనంగా రోదిస్తూ ఉండిపోయింది శశి. ఏంజరిగిందో అర్ధం కాలేదు రవికి. గోడమీద ఫొటోకి దండ వేసి ఉండటం చూసి ఒక్కసారిగా స్థాణువైపోయాడు.
తనకు ఉత్తరాలు ఎందుకు రాలేదో అర్ధమైంది రవికి. కాసేపటికి తేరుకున్నాడు. తాను బాధపడితే వారిని మరింత బాధపెట్టిన వాడినౌతానని నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. లక్ష్మికి మాత్ర ఇచ్చి పడుకోబెట్టింది శశి. వసారాలో కూర్చునారు రవి, శశి. కాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరు. ఏమి జరిగింది శశి? ఆయన్ని ఆఖరిసారి చూడలేకపోయానే అన్న బాధ ఎక్కువైపోతోంది నాకు. నిదానంగా జరిగింది చెప్పింది శశి.
— — — సశేషం.