Stories by మై మ్యూజింగ్స్ on Medium
చిన్న చిన్న గొడవలు కొత్తేం కాదు మా ఇద్దరికీ. ఇంతకు ముందు చిన్న చిన్నవి జరిగినా ఎక్కువ సేపు చూడకుండా, మాట్లాడకుండా *“ఏం చేస్తూందో”* అనుకోకుండా ఉన్న సందర్భం లేదు. ఈ సారి మాత్రం ఇప్పుడు *“ఏం చేస్తూందో”* అనే ఈ ఆలోచన ఓ రవ్వంత ఆలస్యంగా వచ్చింది నిజానికి. ఆవేశంలో బయటకు వచ్చేప్పుడు తెలియలేదు కానీ కొంచెం ఎక్కువ దూరమే నడుస్తూ వచ్చేసాను. ఏం చేస్తూందో అనే ఆలోచన రాగానే వెంటనే వెనక్కి బయలుదేరా.ఇందాక నడుస్తూ వొచ్చిన దారిలోనే.అప్పుడే కొద్ది కొద్దిగా కమ్మేస్తుంది చీకటి. చలిగాలి నాకు మాత్రమే కొంచెం కొంచెం తగులుతున్నట్లుంది. అప్రయత్నంగా చేతులు కట్టుకున్నాను తప్పు చేసిన వాడిలా.
*“నీకు బాధ్యత తెలియడం లేదు”* అన్న ఒక్క మాటకి కోపం వచ్చి ఏంటేంటో మాట్లాడి అక్కడ నుండి బయటకి దూరంగా నడుస్తూ వచ్చేసా. నిజానికి అప్పుడు నేను మాట్లాడిన మాటలేవి ఇప్పుడు గుర్తు రావడంలేదు, కానీ నేను “నాకు బాధ్యత తెలుసని” ఆ క్షణంలో చెప్పలేకపోయానని మాత్రం ఖచ్చితంగా గుర్తుంది. వేడి మీద పాలు పొంగినట్టు పొంగిపోయి, ఆ ఆవేశంలో బయటకు వచ్చి మట్టి రోడ్డు దాటి, మైలు రాయి దాటి, సైదులు సైకిల్ షాపు పక్కనే ఉన్న పార్క్ లోకి సర సరా నడుచుకుంటూ వచ్చేసా.గేటు దగ్గరే ఉన్న చెట్టు కింద ఎప్పుడూ కూర్చునే బల్లపై కూర్చున్నా.
కొంచెం సేపటికి (చాలా సేపైందేమో?) స్థిమితపడి ఇప్పుడు *“ఏం చేస్తూందో”* అన్న ఆలోచన వచ్చింది.ఆ ఆలోచనతో వెంటనే వెనక్కు పార్క్ నుండి బయటకు వచ్చిన నాకు సర సరా నడుస్తూ వస్తున్న *“ఇందాకటి”* నేను ఎదురొస్తూ కనపడుతున్నాను.
“నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది, ఎందుకు అర్థం చేసుకోలేక పోతుంది ఈ మధ్య” అని గొణుక్కుంటూ, నా స్నేహితుడు సైదులు పిలుస్తున్నా వినిపించుకోకుండా, కనీసం వాడి వైపు తిరిగి చూడకుండా పార్క్ లోకి వెళ్లి పోతున్నాను.ఎందుకో సైదులు కూడా నాదగ్గర వచ్చే ప్రయత్నం చేయలేదు. “వెనక్కి” వెళుతున్న నేను, సైదులు ఎందుకు పిలిచాడో? కనీసం పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయినందుకు ఏమనుకున్నాడో? అనుకుంటూ పక్కనే ఉన్న వాడి సైకిల్ షాపులోకి చూసాను. సైదులు ఎవరితోనూ ఒక రిపేర్ గురించి మాట్లాడుతూ, “అరే భయ్యా ఏదైనా ప్రాబ్లం ఉంటే రిపేర్ చేస్కోవాలా, ముందుకి పోవాలా, అంతేగాని అమ్మేసి వదిలించుకోవడం ఏంది భయ్యా". అయినా “మీకు బాగా నచ్చి కొనుక్కున్నావ్ భయ్యా, యాద్ ఉంచుకో” అంటున్నాడు.కష్టమర్ తో వేరే ఏదో పని విషయంలో ఉన్నాడని, మళ్ళీ కలవచ్చునని అక్కడ నుండి ముందుకు కదిలాను.
“ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి, నచ్చినవి ఎలా వదిలేస్తాం” అన్న వాడి మాటలు మాత్రం కొన్ని ఒంటరిగా ఉన్న నాతో వెంటే వస్తున్నాయి.
కొంచెం ముందుకు రాగానే మైలు రాయిని దాటుకుంటూ నాకెదురుగా వస్తున్న *“ఇందాకటి”* నేను మళ్ళీ ఎదురుగా కనబడ్డా. “ఈ మధ్య ఎప్పుడూ ఇలానే విసిగిస్తోంది, ఎందుకిలా చేస్తుంది. ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి ఒకటికి రెండు సార్లు అడుగుతుంది, ఏదో తప్పు చేస్తునట్లుగా” అనుకుంటూ పోతున్నాను. “వెనక్కి” వెళుతున్న నాకే చాలా కోపంగా కనబడుతున్నాను చూడ్డానికి. ఇంత కోపంతో ఎన్నెన్ని, ఏమేమి మాటలన్నానో అనిపించింది వెంటనే. నేనంటేనే పిచ్చి ప్రేమ అసలే, ఇందాక నేను అన్న మాటలు మనసుని ఎంత బాధ పెట్టాయో, అసలు ఇప్పుడు “ఏం చేస్తూందో” అనుకుంటూ ఇంకొంచెం నడక వేగాన్ని పెంచాను.నడక వేగంతో పాటు నా*“లో”* ఆలోచనల వేగం పెరిగింది.
“నేనే తనకు మొత్తం ప్రపంచం, ఇంకా నేనంటే కొండంత ఇష్టం. నన్ను, నా మాటల్ని అర్థం చేసుకుంటుందిలే” అన్న ఆలోచనల్తో కొంచెం మనసు కొంచెం కుదుటపడి, నాపై చూపించే ప్రేమ గుర్తుకు వచ్చింది.ఎప్పుడూ నా ఆలోచనలే, నేనెక్కడున్నా నా వెంటే నీడలా ఉంటాయి ఆ ఆలోచనలు అని చెప్తూ ఉంటుంది. *“నువ్వు అచ్చంగా నేనే”* అంటుంది అప్పుడప్పుడు. అలా అంటున్నప్పుడు కళ్ళలో తెలిసిపోతుంది ఆ నిజం.కొన్ని సార్లు ఏదో డిఫెన్స్ చేయడానికని “అంత లేదులే” అని సరిపెడతాను, కొన్ని సార్లు ఏం మాట్లాడాలో తెలియక చూస్తుంటాను. నేనెందుకలా అం(ఉం)టానో తెలుసు, నవ్వుకుంటుంది నన్ను చూస్తూ. ఆ నవ్వు నేనెప్పుడూ మర్చిపోలేనిది.ఏదో డీఫాల్ట్ అప్లికేషన్లాగా మైండ్లోనే (గుండెల్లోనా?) ఉంటుంది నాకు.అసలా విషయానికొస్తే నేనూ అలానే నవ్వుతానేమో అనిపిస్తుంది. ఎప్పుడూ అద్దంలో చూసుకోలేదు నన్ను నేను నవ్వేప్పుడు,అందుకని కన్ఫర్మ్ చేయలేను కానీ కొన్ని అనిపించడాలు కనిపించనవసరం లేదేమో కన్ఫర్మ్ చేసుకోగలం.అసలు ఎందుకు మనల్ని ప్రేమించే వాళ్ళ మీదే ఈ కోపాల్ని, ప్రకోపాల్ని ప్రదర్శిస్తాం అనిపించింది. వాళ్ళ మీద మాత్రమే చూపించగలం కదా అని సరిపెట్టుసుకున్నా. కొన్ని ప్రశ్నలకు మనకు అనువైన సమాధానాలనే మనసు వొప్పుకుంటుంది నిజంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా.
ఎర్రమట్టి రోడ్డు మీదకు రాగానే నాకెదురుగా వస్తున్న *“ఇందాకటి”* నేనుని గుర్తు పట్టలేకపోయా ఈసారి నిజానికి. ఏదో పోగొట్టుకుని చెప్పుకోలేకపోయి, రెప్పలు దాటకుండా ఉప్పు నీటిని నియంత్రిస్తూ, తలవొంచుకుని సర సరా ముందుకెళ్ళి పోతున్నాన్నేను.“అప్పటి” కోపం ఇప్పుడు లేకపోవడం వల్లనో లేక వర్తమానంలో గతాన్ని చూసుకుంటూ, ఒకే సారి రెండు సందర్భాల్లోని నన్ను పోల్చుకోవడం వల్లనో నాకు నేనే కొంచెం కొత్తగా అనిపించాను.కోపం తగ్గిపోయింది. దాని వల్లనేమో, ఏం నన్ను ఆమాత్రం అనకూడదా? ఎందుకంత అహం? అనిపించింది. కనీసం నన్ను నేను అదుపు చేసుకోలేక పోయానా? ఏంటీ కోపం? అని ఇంకా ఏవో ఆలోచనల్లో ఇంటి దాకా నడుస్తూ వచ్చేసా.
పూర్తిగా చీకటి పడింది ఇంటికి వచ్చేసరికి. ఇంటి ముందు,లోపల దీపాలు వెలుగుతున్నాయి. బయటెక్కడైనా కనిపిస్తుందేమోనని చూసా ఎక్కడా కనబడలేదు. లోపల ఒక్కటే *“ఏం చేస్తూందో..!?”* అనిపించింది.ఎంత బాధ పడిందో? నా ప్రవర్తనకు, మాటలకు అనుకున్నా.ఆ కోపంలో ఏం ఆలోచించకుండా అక్కడ నుండి వచ్చేసాగాని ఇప్పుడు అదోలా అనిపించింది మొహం చూపించాలంటే. ఇలా అనుకుంటూనే లోపలకి వెళ్లి చూసా. భోజనం సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తుంది నాకోసం *“అమ్మ”*
జరిగిన దాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ఉంది అమ్మ.నన్ను చూడగానే అమ్మ కళ్ళలో నవ్వు వెలుగు తెలుస్తోంది నాకు.నేను మాత్రం సూటిగా చూడలేక పోయాను కానీ ఆ నవ్వుతో కొంచెం సంభాళించుకున్నాను నన్ను నేను. అసలు ఏం జరగట్లు ఎప్పటిలానే ప్రశాంతంగా ఉంది ఇంట్లో వాతావరణం.అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ లోపలి నుంచి వస్తున్నాడు నాన్న. అత్తయ్య వాళ్ల ఇంటికి వెళుతున్నాననీ, రేపు వస్తానని తెల్లారగట్టే బయలుదేరి వెళ్ళాడు.మరి అప్పుడే వచ్చేసాడే? అనుకుంటుండగా,అక్కడ త్వరగా పనైపోయిందిరా అందుకే త్వరగా బయలుదేరి వచ్చేసాను అన్నాడు నాన్న. అవునా.!? అన్నట్లు చూస్తున్న నన్ను మళ్ళీ ఒక్క క్షణం తేరిపార చూసి ఏం అలా ఉన్నావ్!? వొంట్లో బాగోలేదా? అని దగ్గరకు వస్తూ అడిగాడు. నేనేదో చెప్పబోతుంటే “వాడికేం బాగానే ఉన్నాడు, ముందు మీరెళ్ళి బట్టలేసుకుని వస్తే భోజనానికి కూర్చుందాం. తింటూ మాట్లాడుకోవచ్చు” అన్న అమ్మ మాటలు విని “అర్థం” చేసుకుని నాన్న లోపలి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మ నావంక చూస్తూ వెళ్లి త్వరగా రెడీ అయి రారా భోజనం చేద్దాం అంది.ఆ ఒక్క చూపు, మాటతోటే నన్ను లోపలికి పంపించేసి అమ్మ ఏదో పని ఉన్నట్లు వంటగదిలోకి వెళ్ళింది.
చలువ పంచె కట్టుకుని ప్రశాంతంగా భోజనానికి కూర్చున్నాడు నాన్న. భోజనానికి వస్తున్న నన్ను చూసి ఏదో జరిగింది! అని మాత్రం తెలుసుకున్నాడు,కాని మళ్ళీ అడగలేదు. మొదటి నుండి చాలా విషయాలు అమ్మ కోర్టులో ఉన్నప్పుడు నాన్న విచారణకు దిగడు.ఇందాక అమ్మ మద్యలో దూర్చిన మాటతోనే అది కన్ఫర్మ్ చేసుకున్నాడు. నాకు మాత్రం మొదట అమ్మే నాతో మాట్లాడినా ఇంకా లోపల పూర్తిగా కుదుట పడలేదు.భోజనానికి కూర్చున్నాం.చింతచిగురు పప్పు అమ్మ వడ్డిస్తోంది, నాన్న అత్తయ్య వాళ్ల విషయాలు చెప్తున్నాడు. వింటూ భోజనం చేస్తున్న నన్ను “అదేం కలుపుకోవడంరా, ఇటువ్వు అంటూ నా కంచాన్ని తీసుకుని చక్కగా కలిపి చేతికి ఇచ్చింది”.ఎప్పటిలానే అదే ప్రశాంతత అమ్మ మొహంలో.దీంతో నా లోపల కొంచెం సర్దుకుంది.నాన్నకు చాలా చాలా ఇష్టం చింతచిగురు పప్పు. చింతచిగురు పప్పు చేయడంలో అమ్మను మించిన వారెవరూ మా తాలుకాలో లేరంటాడు నాన్న.అది నిజమే.అమ్మ వడ్డిస్తూంది, అంతలోనే “అయ్యోయ్యో ఆగండి” అంటూ నాన్న నోట్లో పెట్టుకోబోతున్న ముద్దలో ఉన్న చిన్నవెంట్రుక తీసేసింది, ఎలా వచ్చిందబ్బా..!? అనుకుంటూ.నాకెందుకు కనబడలేదన్న నాన్న మాటకి సమాధానంగా, కొన్ని సార్లు అంతే “కంటికి మనసుకి దగ్గరైతే చిన్న చిన్న తప్పొప్పులు మంచి చెడులు కనబడవండీ” అని ఇద్దర్నీ చూస్తూ చెప్పింది.అమ్మ అన్న ఆ మాట ఇద్దరికీ సమానంగా అర్థం అయింది. మనసుకి దగ్గరైన వారి తప్పోప్పులు కనబడవు అన్న మాటతో నా మనసు నెమ్మదిచింది. అమ్మ మనసుకి దగ్గరగా ఇంకెవరుంటారు అనుకుంటూ వేరే ఆలోచన లేకుండా భోజనం ముగించా.
ఆరుబయట పడుకున్న నాకు అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనే దానికన్నా జరిగి ఎటు పోయింది అనే ఆలోచన వచ్చింది. చెప్పాలనుకున్న విషయం అక్కడే ఉండి చెప్పినా లేక వివరంగా అడిగినా అమ్మ మనసు కష్టపెట్టానేమో అన్న భావన తప్పేది కదా అనిపించింది. పార్క్ నుండి ఇంటికి వస్తూ ఒంటరిగా నన్ను నేనే పరిశీలన చేసుకుంటే (*నన్ను నేనే చూసుకుంటే..?*) కానీ అర్థం అవ్వలేదు ఈ విషయం. కొన్ని జరిగిపోయేదాకా మనం చేస్తున్నది సరైనదో కాదో మనకు తెలియదు.మనల్ని బలంగా ముందుకు తోసి ఆ విధంగా చేయడానికి కారణమైన పరిస్థితుల్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇంకోలా కనిపిస్తాయి అనిపించింది.నా మాటలతో అంత కష్టపెట్టి, ఒంటరిగా వదిలిపెట్టి, దూరంగా వెళ్లి పోయి,తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన నా చూపుల్లోని అపరాధ భావానికి ఒక్క నవ్వుతో అమ్మ సమాధానం చెప్పింది.మరోసారి “నీకు బాధ్యత తెలియడం లేదు” అని అంటే *నాకు తెలుసు* అని చెప్పాలి,అంతే కానీ దూరంగా పారిపోకూడదని బలంగా ఆరోజు అనుకున్నా.కానీ అలాంటి మరో రోజు రాలేదు. బహుశా నేను ఇంకెప్పుడు బాధ్యత తెలీకుండా ప్రవర్తించలేదేమో లేక అమ్మ మనసుకి మరింత దగ్గరయ్యానేమో అనిపించింది ఆరోజు తర్వాత.
-సశేషం
నా తొలి “పూర్తి చేసిన” ప్రయత్నం ఇది. మంచి మాటలైతే కామెంట్ చేయండి, మందలింపు అయితే డైరెక్ట్ మెసేజ్ చేయండి. రెండు తీసుకోగలను 😊.
ఇంకా మా సీనూ గాడి, చెందు గాడి, జిలానీల ఎన్నో ముచ్చట్లు పూర్తిగా మనసులో, సగం సగం డ్రాఫ్టుల్లా నోట్సులో ఉండిపోయాయి. అన్ని మున్ముందు మీతో పంచుకోవాలనుకుంటూ..
ఇప్పటికి సెలవు 🙏