Skip to playerSkip to main content
  • 8 years ago
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామపరిధిలో ఎంబీఎంఆర్ కాలనీలో మాజీ యాంకర్ తేజస్విని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామానికి చెందిన పవన్ కుమార్, తేజస్విని అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. వీరు ఇల్లు అద్దె ఇంట్లో ఉంటున్నారు.
ఏడాదిన్నర క్రితం వీరికి ఒక పాప జన్మించింది. అప్పట్నుంచీ పవన్ తల్లి వెంకట్రావమ్మ కొడుకు కోడలు వద్దే ఉంటోంది. పవన్ ఉయ్యూరులోని ఓ సంస్థలో పని చేస్తూ ఈడుపుగల్లులోని ఎంబీఎన్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. గత కొంతకాలంగా పవన్, తేజస్విని మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. గొడవలు జరుగుతుండేవి.
ఇటీవల పవన్ షిరిడి వెళ్లగా తేజస్విని, ఆమె కుమార్తె, పవన్ తల్లి వెంకట్రావమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో వెంకట్రావమ్మ కోడలును పిలిచేందుకు ఆమె గది వద్దకు వెళ్ళింది. ఎంత పిలిచినా కోడలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు సాయంతో తలుపు పగలగొట్టి చూడగా తేజస్విని గదిలో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended