Better Medical Services : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. అత్యవసర సేవలతో పాటు యూరాలజీ, న్యూరాలాజీ, అంకాలజీ విభాగంలో సేవలు అందిస్తున్నారు. త్వరలోనే నెఫ్రాలజీతో పాటు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఆసుపత్రికి ఆ హోదా కల్పించక పోయినా అత్యుత్తమ సేవలు అందిస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. వైద్యం చేయించుకునేందుకు జిల్లా ప్రజలతో పాటు కామారెడ్డి, నిర్మల్, మహారాష్ట్ర ప్రజలు సైతం భారీగా వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓపీ సమయాన్ని పెంచి మరిన్ని సేవలు అందించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Be the first to comment