NTR Trust Nutriful App : జీవనశైలిలో ఆహారపు అలవాట్లతోపాటు చిన్నపాటి మార్పులు చేసుకుంటే రోగాలు రాకుండా నివారించవచ్చు. చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించి వారి జీవనశైలిలో మార్పు తెచ్చే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ న్యూట్రిఫుల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని యాప్ రూపకల్పన చేయించారు. తాను ఉపయోగించడంతోపాటు పార్టీ నాయకులు, శ్రేణులకూ ప్రతి సమావేశంలోనూ చెబుతుంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న ఉత్తమ సేవలకు గుర్తింపుగా యాప్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో స్కోచ్ గోల్డెన్ అవార్డుకు న్యూట్రిఫుల్ ఎంపికైంది.
Be the first to comment