BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో దిల్లీలో విద్యార్థుల నిరసనలు
జన్‌పథ్ జంక్షన్లో, షాంఘ్రీలా హోటల్ ముందు, పోలీసు బలగాలు నిరసనకారులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు చోట్లకు తరలించారు.
కేటీఆర్‌కు హోటళ్లు ఎన్ని? అఫిడవిట్లలో ఏముంది.. వెబ్సైట్లో ఏం ఉంది?
కేటీఆర్ హోటళ్ల వ్యాపారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఎన్నికల అఫిడవిట్లలో కేటీఆర్ ఏం ప్రస్తావించారు? ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్‌లో కేటీఆర్‌కు, ఆయన కుటుంబానికి ఉన్న వాటా ఎంత? హోటళ్లకు సంబంధించిన వివరాలేంటి?
'పిచ్చోనివా.. ఆడపిల్లలకు స్పోర్ట్స్ ఎందుకన్నారు'
"ఆడపిల్లలకు ఆటలెందుకు?" అని ఎగతాళి చేసిన చోటే, ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో సత్తా చాటింది తెలుగమ్మాయి చికితా రావ్. అప్పులు చేసి కూతురిని ప్రోత్సహించిన ఆ తండ్రి పట్టుదల, ఓ రైతు బిడ్డ ఆసియా ఛాంపియన్‌గా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రయాణమిది..
'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ: ప్రేక్షకులను ట్రబుల్ పెట్టిందా?
ఫహద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ప్రేక్షకులను ఆకట్టుకుందా? మ్యాజిక్ రియలిజంతో వచ్చిన ఈ ఫాంటసీ డ్రామాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ నీర్జా భనోత్ పేరు ఎందుకు చర్చకు వస్తోంది
తీవ్ర గాయాలపాలైన కెప్టెన్ స్మిత్ స్పృహ కోల్పోవడానికి ముందు, తన సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపులు తెరిచారని ఆ విమానంలో ప్రయాణించిన యానివ్ హయూన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు చెప్పారు. ఫలితంగానే ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లే వీలు కలిగిందని తెలిపారు.
పుట్టిన రోజు నాడే గోల్డ్ మెడల్ సాధించిన భారత బాక్సర్ లవ్లీనా
ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన లవ్లీనా, తన పుట్టినరోజున 75 కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన బావో జియీని 5-0 తేడాతో ఓడించారు.
స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న వారికి ఏనుగు మాంసంతో భోజనం.. 23 ఏనుగుల వేటకు అనుమతి ఇచ్చిన బోట్స్వానా ప్రభుత్వంపై విమర్శలు
ఈ నిర్ణయం జంతు సంరక్షణ చర్యలను బలహీనపరుస్తుందని బోట్స్వానాలోని ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సొసైటీ హెచ్చరించింది.
మరణశిక్ష కోసం రెండుసార్లు విషం ఎక్కించినా ఆమె చనిపోలేదు, మరి ఇప్పుడేం చేస్తారు? ఆమె ఎలా ఉన్నారు?
ఈ పరిణామం తర్వాత ఆమె మరణశిక్షను తగ్గించాలని ఆమె తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. 1996లో కొలీన్ స్లెమ్మర్ అనే 19 ఏళ్ల యువతిని క్రూరంగా హింసించి హత్య చేసిన కేసులో ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్న పైక్‌కు కోర్టు మరణశిక్ష విధించింది.
తెల్లకాగితం రివ్యూ: సందేశాత్మక టీనేజ్ లవ్ స్టోరీ మెప్పించిందా?
నిజానికి ఈ తరహా కథలను ఆ వయసు దాటి వచ్చిన ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా మెచ్యూర్డ్‌గా రాసుకుంటే కనెక్షన్ ఇంకా బలంగా ఉండేది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































